Alliance candidates nominations for three Rajya Sabha seats: రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం తరఫున బీద మస్తాన్‌రావు, సానా సతీష్ బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య అసెంబ్లీ ఆవరణలో నామినేషన్లు వేశారు. వీరికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు తరలివచ్చారు. మూడు స్థానాలకు కేవలం ముగ్గురే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
"పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం" - డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్
కూటమి అభ్యర్థులు నామినేషన్లు: రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికల సందడి నెలకొంది. ఇటీవల ఖాళీ అయిన స్థానాలకు తెలుగుదేశం నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్, B.J.P. నుంచి R.కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బీద మస్తాన్ రావు ఈ సందర్భంగా తెలిపారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి బీసీలకు కీలక పదవులు దక్కుతున్నాయన్నాయన్నారు. చిన్న వయస్సులోనే తనను నమ్మి ఇంత కీలక పదవి ఇచ్చి ప్రోత్సహించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు సానా సతీష్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చిన అవకాశాన్ని బాధ్యతతో నిర్వర్తిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొర్రా జయకేతనం - తొలి ప్రాధాన్యంలోనే తేలిన ఫలితం!
అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ సంతకాలు: బీసీలకు చేసిన సేవలను గుర్తించే బీజేపీ తనకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిందని ఆర్.కృష్ణయ్య తెలిపారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కేంద్రం మద్దతు అవసరమని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీల ప్రయోజనాల కోసమే తన ప్రయాణమన్నారు. ఈ సమయంలో రాజ్యసభ సభ్యులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్ , ఆర్. కృష్ణయ్యల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కూటమి అభ్యర్థులు సంతకాలు చేపట్టారు. టీడీపీ ఎం.ఎల్.ఏ లు అసెంబ్లీలోని తెలుగుదేశం శాసన సభాపక్ష కార్యాలయానికి చేరుకుని ముగ్గురి అభ్యర్థిత్వాలను బలపరుస్తూ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డోలా బాలవీరాంజనేయులు, సత్యకుమార్ యాదవ్, చీఫ్ విప్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
"గెలుపు పెద్ద కష్టమేమీ కాదు"- హుందా రాజకీయాలు చేద్దామన్న సీఎం చంద్రబాబు