ETV Bharat / state

'జగన్‌ ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి'-జోరుగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం - Alliance Candidates campaign

Alliance Candidates Election Campaign in AP : రాష్ట్రంలో కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఇంటింటికీ వెళ్లి సూపర్​ సిక్స్​ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. వీరికి మద్ధతుగా సినీ నటులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో జగన్​ను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

election_campaign
election_campaign (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 8:20 AM IST

'జగన్‌ ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి'-జోరుగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం (Etv Bharat)

Alliance Candidates Election Campaign in AP : రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ఎన్నికలకు ఇక పదిరోజులే సమయం ఉండటంతో అధికార, విపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులూ, సినీ నటులు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతున్నాయి.

Krishna District : పెనమలూరు నియోజకవర్గం కానూరులో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అవనిగడ్డలో మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు, కోడలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుడ్లవల్లేరు మండలంలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము రోడ్‌ షో నిర్వహించారు. మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌ సతీమణి శిరీష ప్రచారం చేశారు. పెనుగంచిప్రోలు మండలం కొనకంచిలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య రోడ్‌ షో నిర్వహించి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. కంచికర్ల మండలంలో తంగిరాల సౌమ్య ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. విజయవాడలో గద్దె రామ్మోహన్‌, రణదీర్ నగర్ కరకట్టలో ఆయన భార్య అనురాధ ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

జగన్​ మళ్లీ గెలిస్తే ఎవరి భూములు మిగలవు - హెచ్చరించిన సినీనటుడు శివాజీ - Hero Shivaji Election Campaign

Guntur District : గుంటూరు జిల్లా బేతపూడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్‌ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. కొలకలూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ రోడ్‌ షో చేపట్టారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. తెనాలిలో రజకుల సంఘం నేతలు ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల్ మనోహర్‌తో కలిసి పాల్గొన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే జగన్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో లోకేష్‌కు మద్దతుగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఇంటింటా ప్రచారం చేపట్టారు. పల్నాడు జిల్లా గురజాల మండలం లో లావు శ్రీకృష్ణదేవరాయలు భార్య మేఘన, యరపతినేని శ్రీనివాసరావు సతీమణి నాగమణి ప్రచారంలో పాల్గొన్నారు. పెద్దగార్లపాడులో యరపతినేని యువతతో కలిసి రోడ్‌ షో నిర్వహించారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలంలో ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారం చేశారు. చీరాల 21వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి కొండయ్య తనయుడు మహంద్ర నాథ్‌, సినీ నటుడు నిఖిల్‌ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.

వలస పక్షులకు కొండెపివాసులు మద్దతివ్వరు: డోలా బాల వీరాంజనేయ స్వామి - Dola Bala Veeranjaneya Swami

Srikakulam District : శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలంలో బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు రోడ్‌ షో చేపట్టారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీకి చెందిన 50 కుటుంబాలు బీజేపీలో చేరాయి. శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్, ఆమదాలవలసలో కూన రవికుమార్‌ ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్ పథకాలు వివరించారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంతం నానాజీ ప్రచారం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమా బాల, ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి భారీ ర్యాలీ నిర్వహించారు. తణుకు మండలంలో టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ, ఇరగవరంలో ఆయన భార్య ప్రచారం చేశారు. ఉండిలో అభ్యర్థి వేటుకూరి శివరామరాజు ఆవు పాలు తీసి స్థానికులను ఆకట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు, ఉండ్రాజవరం మండలాల్లో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్‌ రోడ్‌ షో నిర్వహించగా ప్రచారంలో సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. ద్వారకా తిరుమల మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చింతలపూడిలో టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్‌కు మద్దతుగా వంగవీటి రాధా రోడ్‌ షో చేశారు.

దూకుడు పెంచిన కూటమి అభ్యర్థులు - జోరుగా ఇంటింటి ప్రచారం - Alliance Leaders Election Campaign

Vizianagaram District : విజయనగం జిల్లా రాజాంలో టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్ పథకాలను వివరించారు. బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం కొండకింగువలో వైఎస్సార్సీపీకి చెందిన 100 కుటుంబాలు బేబి నాయన సమక్షంలో టీడీపీలో చేరాయి. విశాఖలో టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్‌ న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మద్దతుగా నిలవాలని కోరారు. విశాఖ భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ ఎన్నికల ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన సినీ నిర్మాత, ఉపకార్‌ ట్రస్టు అధినేత కంచర్ల అచ్యుతరావు టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో బండారు సత్యానందరావు రోడ్‌ షో నిర్వహించారు. కాట్రేనికోన మండలంలో టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ప్రచారం చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌ ఎన్నికల ప్రచారం చేశారు.

'రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కూటమితోనే సాధ్యం'- గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ప్రచారం - Alliance Leaders

Kurnool District : కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో టీడీపీ అభ్యర్థి జీవీ జయనాగేశ్వరరెడ్డి, కర్నూలులో టీజీ భరత్‌ ఇంటింటి ప్రచారం నిర్విహించారు. మంత్రాలయం నియోజకవర్గం కల్లుకుంటలో వైఎస్సార్సీపీకి చెందిన 40 కుటుంబాలు రాఘవేంద్రరెడ్డి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. పత్తికొండ నియోజవర్గం తుగ్గలిలో టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు రోడ్ షో నిర్వహించారు. పాణ్యంలో వైఎస్సార్సీపీకి చెందిన పలువురు గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో పసుపు కండువా కప్పుకున్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కేపీ తండాలో అఖిల ప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి రోడ్‌ షో నిర్వహించారు. జనసేన నేత ఇరిగెల రాంపుల్లారెడ్డితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మైదుకూరులో వైఎస్సార్సీపీ యువజన రాష్ట్ర కార్యదర్శి తప్పెట శశిధర్‌ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఇంటింటికీ వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.
'ఎన్నికల్లో జగన్‌ సర్కారును తరిమికొట్టాలి'- గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ప్రచారం - Alliance Leaders Election Campaign

Anantapur District : అనంతపురంలో కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ విస్తృతంగా ప్రచారం చేశారు. కళ్యాణదుర్గం మండలంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు రోడ్‌ షో నిర్వహించారు. వైఎస్సార్సీపీకి చెందిన పలువురు టీడీపీలో చేరారు. ఉరవకొండ మండలంలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ రోడ్ షో నిర్వహించారు. సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలం మరికొమ్మదిన్నెలో 25 ముస్లిం మైనార్టీ కుటుంబాలు కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరాయి. ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా సినీ నటి నమిత రోడ్‌ షో నిర్వహించారు. ముదిగుబ్బ మండలంలోని గ్రామాల్లో సత్యకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో టీడీపీ అభ్యర్థి సవిత ఇంటింటా ప్రచారం నిర్వహించి సూపర్‌ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.