All parties round table meeting: ప్రత్యేకహోదా, విభజన హామీల సాధనకు మళ్లీ ఉద్యమిస్తున్నామని ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపడతామని చెప్పారు. ఎంపీలందరికీ లేఖలు రాస్తామని, పట్టించుకోకపోతే నిలదీస్తామని చెప్పారు. వచ్చే నెల 7,8,9 తేదీల్లో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని శ్రీనివాస్ చెప్పారు.
దిల్లీ పెద్దల ముందు మెడలు వంచారు: ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ మాట ఏమైందని ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. విజయవాడ ఎంబీ భవన్లో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో చలసాని శ్రీనివాస్ మాట్లాడారు. జనవరి 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలతో కలిసి నిరాహార దీక్ష చేస్తామని చలసాని వెల్లడించారు. ప్రత్యేక హోదా అంశంపై ఎంపీలకు లేఖలు రాయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా కోసం దిల్లీ పెద్దల మెడలు వంచుతామని చెప్పిన జగన్, సీఎం అయ్యాక దిల్లీ పెద్దల ముందు మెడలు వంచారని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వానికి ఇవే ఆఖరి పార్లమెంట్ సమావేశాలని జోస్యం చెప్పారు. విద్యార్థి, యవజన సంఘాలు సైతం ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపినట్లు చలసాని శ్రీనివాస్ వల్లడించారు పోరాడనున్నట్లు తెలిపారు.
టీడీపీ ప్రపంచానికి అరకు కాఫీని ప్రమోట్ చేస్తే - వైఎస్సార్సీపీ గంజాయిని చేస్తోంది: చంద్రబాబు
ప్రత్యేక హోదాపై గళాన్ని బలంగా వినిపిస్తాం: పదేళ్లయినా ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేరలేదని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఇది ముగిసిన అధ్యాయం కాదని, కొందరు స్వార్థపరులు ఇది ముగిసిన అధ్యాయంగా చెబుతున్నారని ఆరోపించారు. త్వరలో అన్ని జిల్లాలు వెళ్లి ప్రత్యేక హోదాపై సదస్సులు నిర్వహించి, ప్రజలను చైతన్యవంతం చేస్తామని చెప్పారు. దిల్లీ వెళ్లి ప్రత్యేక హోదాపై గళాన్ని బలంగా వినిపిస్తామని, ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధి ఉంటే ప్రధాన పార్టీల నేతలు స్టాంపు పేపర్ పై సంతకాలు చేసి ఇవ్వాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా వస్తే, రాష్ట్రానికి అనేక వెసులుబాటులు వస్తాయని తెలిపారు. ట్యాక్స్ ఫ్రీతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ప్రత్యేక హోదా అనేది లేదని చెబుతున్న బీజేపీ పెద్దలు గుజరాత్ రాష్ట్రంలో గిఫ్ట్ సిటీ పెరుతో రాయితీలు ఇస్తున్నారని ఆరోపించారు. అలాగే ఏపీ సైతం ప్రత్యేక హోద వస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు.
ఎకరం రూ.73 వేలతో 12 వేల ఎకరాలు కొట్టేశారు- జే గ్యాంగ్ భారీ 'భూ'మంతర్' పై 10 ఏళ్లుగా సాగుతున్న విచారణ
సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు: ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రజలంతా ముందుకు రావాలని వక్తలు పిలుపునిచ్చారు.
వైఎస్సార్సీపీలో అసమ్మతి మంటలు- రాజీనామాలకైనా సిద్ధమంటున్న ప్రజాప్రతినిధులు