ETV Bharat / state

వరద బాధితుల కోసం అమ్మలా 'అక్షయపాత్ర' - ఇప్పటి వరకు 10.30 లక్షల మందికి ఆహారం - Akshaya Patra Support Flood Victims - AKSHAYA PATRA SUPPORT FLOOD VICTIMS

Akshaya Patra Support in Flood Victims : ఆకలితో అల్లాడుతున్న లక్షల మంది బాధితులను ఆదుకోవాలంటే గిన్నెలు, గుండిగలు సరిపోవు. అందుకే అక్షయపాత్ర ఉండాల్సిందే. వరద బాధితుల్లో ఏ ఒక్కరూ ఇళ్లలో వంట చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. వరద తగ్గినా బురద బాధ మరికొన్నాళ్లు ఉంటుంది. వారందరి ఆకలి తీర్చేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. ప్రతి నాలుగు గంటల్లో లక్ష మందికి వండి వారుస్తూ అమ్మ పాత్ర పోషిస్తోంది.

Akshaya Patra Support in Flood Victims
Akshaya Patra Support in Flood Victims (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 10:50 AM IST

Akshaya Patra Preparing Food for Flood Victims : బుడమేరు, కృష్ణా వరదల్లో చిక్కుకుని బాధితులు విలవిల్లాడుతున్నారు. వీరికి అక్షయపాత్ర (హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌) వరప్రదాయినిగా మారింది. వరదనీరు చుట్టుముట్టి ఆకలిదప్పులతో అలమటిస్తున్న విజయవాడ ప్రజలకు వేగంగా ఆహారాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వ భావించింది. ఈ కృతనిశ్చయానికి తోడ్పాటుగా అక్షయపాత్ర నిలిచింది. వందలు, వేలు కాదు లక్షల మంది బాధితులు. వరద ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఒకపూట, రెండు పూటలు కాదు రోజుల తరబడి ఆహారాన్ని అందించాలి. ఇంతటి విపత్కర కాలంలో వారికి సంస్థ అండగా నిలిచింది. రాత్రి, పగలనే తేడా లేకుండా నిర్విరామంగా శ్రమిస్తూ ఆదివారం నుంచి ఇప్పటివరకు 10.30 లక్షల మందికి సరిపడా ఆహారాన్ని సరఫరా చేసింది.

Akshaya Patra Support in Flood Victims
ఆహార పొట్లాలు సిద్ధం చేస్తున్న స్వచ్ఛందసేవకులు (ETV Bharat)

గంటన్నరకు 45 వేల మందికి ఆహారం తయారీ : అక్షయపాత్ర ఫౌండేషన్‌ సంస్థ ఆహార తయారీ కేంద్రం మంగళగిరి సమీపంలో ఉంది. ఈ సంస్థ మంగళగిరి, దుగ్గిరాల, తాడేపల్లి, తుళ్లూరు మండలాల పరిధిలోని 315 పాఠశాలల్లో ఉన్న 25,000ల మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఆహారాన్ని లాభాపేక్ష లేకుండా తయారుచేస్తుంది. గంటన్నరలో 45,000ల మందికి సరిపడా అన్నం సిద్ధం చేసేలా వంటశాల యంత్రాలను రూపొందించారు. సాంబారు, సాంబారు రైస్‌ కూడా అదేస్థాయిలో సిద్ధం చేసే యంత్రాలూ అక్కడ ఉన్నాయి.

మరోవైపు రెండు నిమిషాల్లో 250 కిలోల పులిహోరను కలిపే యంత్రాలు అందుబాటులో ఉంచారు. దీన్ని గుర్తించిన సర్కార్ వరద బాధితులకు ఆహారాన్ని అందించేందుకు అక్షయపాత్రను పురమాయించింది. డబ్బులిస్తామని, ముందు తయారీ చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. వరద బాధితులకు గతంలోనూ అండగా నిలిచిన ఆ సంస్థ తాజా పరిస్థితికి అనుగుణంగా బాధితులకు అండగా నిలిచేందుకు రేయింబవళ్లు నిర్విరామంగా శ్రమిస్తోంది. ప్రతి నాలుగు గంటల్లో లక్షమందికి సరిపడా ఆహారాన్ని సిద్ధంచేసి ప్రభుత్వానికి అందిస్తుంది.

ఒక్కోరోజు ఒక్కో రకం ఆహారం : వరద బాధితులకు మూడు పూటలా ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు 275 మంది పనిచేస్తున్నారు. సాంబారు రైస్, టమాటా బాత్,పొంగలి,టమాటా రైస్, కర్డ్‌రైస్‌, సాంబార్ అందిస్తున్నారు. రోజూ 60,000ల మందికి సరిపడా ఆహారాన్ని అన్నక్యాంటీన్లకు అందిస్తూనే వరద బాధితులకు 24 గంటలూ ఆహారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం రోజుకు 10 టన్నుల బియ్యం, 8 టన్నుల కూరగాయలు, 2 టన్నుల ఉప్పు, 2 టన్నుల నూనె, 5 టన్నుల కందిపప్పు, మిగతావి 200, 300 కిలోల చొప్పున వినియోగిస్తున్నారు. ఏ రోజుకారోజు నిత్యావసరాలను కొంటూ ఎప్పుడూ వారం రోజులకు సరిపడా నిల్వలు ఉండేలా చూసుకుంటారు. సర్కార్ సమకూర్చే వాహనాల్లోకి ఆహారాన్ని లోడ్‌ చేసేందుకు 9 మంది చొప్పున మూడు షిఫ్ట్‌ల్లో 27 మంది పనిచేస్తున్నారు.

ప్యాకింగ్‌ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు ప్రజలు : వరద బాధితుల కష్టాలను చూసి చలించి తమ చేతనైన సాయం చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్‌ వద్ద ఆహారాన్ని తయారుచేసేందుకు పరిమిత సంఖ్యలోనే సిబ్బంది ఉన్నారు. రోజూ లక్షల మందికి అందించేందుకు ప్యాకింగ్‌ ఏర్పాట్లు లేవు. దీంతో సర్కార్ చుట్టుపక్కల గ్రామాల నుంచి అంగన్‌వాడీ, డ్వాక్రా సంఘాల సభ్యులను ప్యాకింగ్‌ చేసేందుకు పంపుతోంది. వీరు రేయింబవళ్లు వందలమంది పాల్గొంటున్నారు. ఒక్క రూపాయి ఆశించకుండా తమ బాధ్యతగా పనిచేస్తున్నారు.

మరోవైపు పాఠశాల, కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమీప గ్రామాలైన ఆత్మకూరు, పెదవడ్లపూడి, మంగళగిరి, తాడేపల్లి, చిలకలూరిపేట, తదితర ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా వచ్చి పనుల్లో పాల్గొంటున్నారు. బుధవారం నిర్మల కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీకి చెందిన ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, జేఎమ్‌జే కళాశాల, పాఠశాల, వసతిగృహానికి చెందిన 35 మంది అధ్యాపకులు, టీచర్లు, పర్యవేక్షకులు ప్యాకింగ్‌ పనుల్లో పాల్గొన్నారు. ఆహార తయారీ, ప్యాకింగ్‌ పరిసరాల్లో పరిశుభ్రతకు ఏ మాత్రం భంగం కలగకుండా సంస్థ ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.

సీఎం, దాతల సహకారంతో లక్షల మందికి భోజనం అందించాం : సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ ద్వారా రోజూ 2.5 లక్షల మంది వరద బాధితులకు ఆహారం తయారుచేసి పంపుతున్నట్లు ఆ ఫౌండేషన్‌ ఏపీ సెంట్రల్‌ రీజియన్‌ అధ్యక్షుడు వంశీధరదాస పేర్కొన్నారు. తొలిరోజు 60,000ల మందికి, ఆ తర్వాత రోజు నుంచి దాదాపు 2.5 లక్షల మందికి భోజనం తయారుచేసి ప్రభుత్వానికి అందిస్తున్నట్లు వివరించారు. ఇందుకు దివీస్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళీకృష్ణ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రూ.4.80 కోట్ల విరాళం అందజేశారని చెప్పారు. పలువురు దాతలు కూడా సాయం అందించారని తెలిపారు. ఇప్పటివరకు పదిలక్షల మందికి భోజనం అందించామన్నారు. దాతలందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు వంశీధరదాస వెల్లడించారు.

వరద బాధితుల కోసం 'అక్షయపాత్ర' - 5 లక్షల మందికి భోజనం - AkshayaPatra Food for Flood Victims

'అక్షయపాత్ర' ఆపన్నహస్తం - స్వచ్ఛందంగా తరలివచ్చిన డ్వాక్రా మహిళలు - AkshayaPatra Food for Flood Victims

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.