ETV Bharat / state

టెన్త్ విద్యార్హతతో ప్రభుత్వ కొలువులు, భారీగా జీతాలు- అప్లై చేసుకోండిలా! - Govt Jobs with 10th Class

Govt Jobs with 10th Class: ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలా మంది టెన్త్​తో చదువుకు స్వస్తి పలుకుతారు. ఏదో చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే పది విద్యార్హతతో కూడా చాలా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని మీకు తెలుసా?

Govt_Jobs_With_10th_Class
Govt_Jobs_With_10th_Class (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 12:33 PM IST

Govt Jobs with 10th Class: ఆర్థిక పరిస్థితులు సహకరించనివారు, ఉన్నత విద్యపై ఆసక్తి లేనివాళ్లూ పదో తరగతితో చదువుకు స్వస్తి పలుకుతారు. కుటుంబ బాధ్యతల కారణంగా ఏదో చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవనం సాగించేస్తూ ఉంటారు. అయితే పదో తరగతి విద్యార్హతతో కూడా చాలా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చు. జీతాలు కూడా భారీగా పొందవచ్చు. ఉద్యోగంలో చేరిన తర్వాత అనుభవం, అంతర్గత పరీక్షలు, ఉన్నత విద్యతో మెరుగైన స్థాయికీ చేరుకోవచ్చు. టెన్త్ విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాల గురించి తెలుసుకుందాం రండి.

పదో తరగతి విద్యార్హతతో ఉద్యోగాలు ఇవే!:

1. ఎస్​ఎస్​సీ:

  • టెన్త్ క్లాస్ విద్యార్హతతో ఎక్కువ పోస్టులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్​ఎస్​సీ) ద్వారా భర్తీ అవుతున్నాయి.
  • కేంద్ర పోలీస్‌ బలగాలతోపాటు ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో జనరల్‌ డ్యూటీ- కానిస్టేబుల్, రైఫిల్‌మెన్‌ పోస్టులకు దాదాపు ఏటా ప్రకటన వెలువడుతుంది.
  • ఒక్కో విడతలోనూ యాభై వేలకు తగ్గకుండా సుమారు లక్ష వరకు ఖాళీలు ఉంటాయి.

పోస్టులు:

  • సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌)
  • బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)
  • సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌)
  • సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ)
  • ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ)
  • నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)
  • స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)
  • అస్సాం రైఫిల్స్‌

వయోపరిమితి:

  • 18-23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎత్తు:

  • పురుషులు- 170 సెం.మీ.
  • మహిళలు- 157 సెం.మీ.

ఎంపిక విధానం:

  • కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, మెడికల్‌ పరీక్షతో నియామకాలు చేపడతారు.

వేతనం:

  • ఎంపికైనవారికి లెవెల్‌ 3 మూలవేతనం రూ.21,700 అందుతుంది.
  • అన్నీ కలిపి సుమారు రూ.40,000 జీతం అందుకోవచ్చు.
  • భవిష్యత్తులో హెడ్‌ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, ఆ పైస్థాయికీ చేరుకోవచ్చు.

2. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌:

  • కేంద్రానికి చెందిన వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన బహుళ సేవల నిమిత్తం మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) పోస్టులను ఎస్‌ఎస్‌సీ దాదాపు ఏటా పదివేలు, ఆపైనే భర్తీ చేస్తుంది.
  • ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ పరీక్షలతో నియామకాలుంటాయి.
  • 18-25/27 ఏళ్లవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎంపికైనవారికి రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. సుమారు రూ.35,000 జీతం అందుకోవచ్చు.

3. అగ్నివీర్‌:

  • ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్సుల్లో పదో తరగతి విద్యార్హతతో సేవలందించాలంటే ముందు అగ్నివీర్‌గా ఎంపికవ్వాలి.
  • ఇందుకోసం పరీక్ష, ఫిజికల్, మెడికల్‌ టెస్టులు నిర్వహిస్తారు.
  • నాలుగేళ్లు విధుల్లో కొనసాగాలి. ఆ తర్వాత వీరిలో 25 శాతం మందికే శాశ్వత ఉద్యోగంలోకి అవకాశం లభిస్తుంది.
  • ఈ నాలుగేళ్లలో మొదటి సంవత్సరం రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏట రూ.36,500, నాలుగో సంవత్సరం రూ.40,000 వేతనం చెల్లిస్తారు.
  • ప్రతి నెలా అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్‌ ఫండ్‌కి జమ చేస్తారు.
  • మొత్తం నాలుగేళ్ల వ్యవధికి రూ.5.02 లక్షలు అగ్నివీరుని ఖాతాలో జమ అవుతాయి. అంతే మొత్తాన్ని ప్రభుత్వమూ అందిస్తుంది.
  • చివరలో రూ.10.04 లక్షలకు వడ్డీని కలిపి అగ్నివీరునికి అందిస్తారు.
  • సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌/ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ నిమిత్తం వీరికి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా చూస్తారు.
  • సర్టిఫికెట్‌ అందిస్తారు.
  • పలు కార్పొరేట్‌ సంస్థల్లో రక్షణ విభాగంలో వీరికి ఉద్యోగాలు ఉంటాయి.
  • త్రివిధ దళాల్లో ఏడాదికి రెండు సార్లు అగ్నివీర్‌ ప్రకటనలు వెలువడుతున్నాయి.

4. ఆర్మీలో ఉద్యోగాలు:

అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ అర్హతలు:

  • పదో తరగతిలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
  • గ్రేడ్‌ల్లో అయితే కనీసం సీ2 ఉండాలి.
  • అలాగే ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం ఉండాలి.

అగ్నివీర్‌ ట్రేడ్స్‌మన్‌ అర్హతలు:

  • పదో తరగతిలో ఉత్తీర్ణులైతే చాలు.
  • ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు ఉండాలి.
  • అలాగే ఈ ట్రేడ్స్‌మెన్‌లో కొన్ని పోస్టులకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతోనూ అవకాశం ఉంది.
  • వయసు కనిష్ఠంగా 17 1/2 గరిష్ఠంగా 23 ఏళ్లలోపు ఉండాలి.
  • ఎత్తుకు తగ్గ బరువు, సరిపోయేంత ఛాతీ కొలతలు అవసరం.

ఎంపిక విధానం:

  • అన్ని పోస్టులకూ ఫిజికల్‌ టెస్టులో అర్హత సాధించాలి.
  • అనంతరం ఫిజికల్‌ మెజర్‌మెంట్, మెడికల్‌ టెస్టులు ఉంటాయి.
  • వీటన్నింటిలో విజయవంతమైతే ఉమ్మడి పరీక్ష నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు.
  • అగ్నివీర్‌ నుంచి శాశ్వత కమిషన్‌లో అవకాశం వచ్చినవారికి సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌ ట్రేడ్స్‌మన్‌ హోదాలు దక్కుతాయి.
  • ఉద్యోగంలో రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు.
  • దీంతోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ), డీఏ, హెచ్‌ఆర్‌ఏ.. ఉంటాయి. రూ.45,000 అందుకోవచ్చు.
  • వీరు భవిష్యత్తులో సిపాయ్, నాయక్, హవల్దార్‌ హోదాలు పొందవచ్చు.

5. నేవీలో ఉద్యోగాలు:

  • అగ్నివీర్‌గా సేవలందించిన తర్వాత నేవీలో షెఫ్, స్టివార్డ్, శానిటరీ హైజీనిస్ట్‌ ఉద్యోగాలు పొందుతారు.
  • 17-23 ఏళ్లలోపు వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రాత, ఫిజికల్ ఫిట్​నెస్​ టెస్టుల​ ద్వారా ఎంపిక చేస్తారు.
  • వీరికి రూ.21,700 మూలవేతనంతో పాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఉంటాయి. రూ.45,000 జీతం అందుకోవచ్చు.
  • భవిష్యత్తులో మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌ స్థాయి వరకు చేరుకుంటారు.

మ్యుజీషియన్‌:

  • నేవీ బ్యాండ్‌లో పనిచేయడానికి మ్యుజీషియన్లు అవసరం.
  • సంగీత పరికరాలపై ప్రావీణ్యం, వయసు 17 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.
  • సంగీత ప్రావీణ్యం, ఫిజికల్, మెడికల్‌ టెస్టులతో నియామకాలు చేపడతారు.

స్పోర్ట్స్‌ కోటా ఎంట్రీ:

  • ఏదైనా క్రీడ/ ఈవెంట్లో ప్రావీణ్యం ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు.

6. ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగాలు:

  • అగ్నివీర్‌ వాయులో నాలుగేళ్ల సేవల అనంతరం అవకాశం దక్కినవారు ఎయిర్‌ ఫోర్స్‌లో గ్రూప్‌ వై మ్యుజీషియన్‌ హోదా పొందవచ్చు.
  • ఈ ట్రేడ్‌ ఉద్యోగాలకు టెన్త్​తో పాటు ఏదైనా సంగీత/ వాయిద్య పరికరంలో ప్రావీణ్యం ఉండాలి.
  • రూ.21,700 మూలవేతనం, రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఉంటాయి. రూ.45,000 అందుకోవచ్చు.

7. కోస్ట్‌ గార్డ్​లో ఉద్యోగాలు:

  • ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో డొమెస్టిక్‌ బ్రాంచ్‌ కుక్, స్టివార్డ్‌ పోస్టులకు రాత, దేహదార్ఢ్య, వైద్య పరీక్షలతో నియామకాలు చేపడతారు.
  • ఉద్యోగంలో చేరినవారికి ప్రారంభంలో రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు.
  • పురుషులే అర్హులు.
  • పదోతరగతిలో 50 (ఎస్సీ, ఎస్టీ 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
  • వయసు 18 - 22 ఏళ్లలోపు ఉండాలి.
  • ఏడాదికి రెండు సార్లు ఈ ప్రకటనలు ఆశించవచ్చు.

8. రైల్వేలో ఉద్యోగాలు:

పదో తరగతితో రైల్వేలో పలు ఉద్యోగాలు ఉన్నాయి. గ్రేడ్‌-4 ట్రాక్‌ మెయింటైనర్‌తోపాటు వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వేతన శ్రేణి ప్రకారం లెవెల్‌-1 (ప్రారంభస్థాయి) ఉద్యోగాలుగా పరిగణిస్తారు. ఎంపికైనవారికి రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. అన్నీ కలిపి రూ.35,000 వరకు మొదటి నెల నుంచే జీతం పొందవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టులతో నియామకాలు చేపడతారు. రైల్వే భద్రత విభాగంలోనూ పదితో సేవలు అందించవచ్చు. రెండు/మూడేళ్లకు ఒకసారి ప్రకటనలు ఆశించవచ్చు.

9. పోస్టల్‌ ఉద్యోగాలు:

  • తపాలా శాఖలో పోస్టుమ్యాన్, మెయిల్‌ గార్డు ఉద్యోగాలకు పరీక్షలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు.
  • వీటికి ఎంపికైనవారికి రూ.21,700 మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ఆలవెన్సులతో రూ.35,000 అందుకోవచ్చు.
  • రెండుమూడేళ్లకు ఒకసారి ప్రకటన ఆశించవచ్చు.

10. గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌):

  • ఇందులో బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), మెయిల్‌ డెలివరర్‌ (ఎండీ), ప్యాకర్‌ పోస్టులను పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తున్నారు.
  • ఏటా ఈ ప్రకటనలు వెలువడుతున్నాయి.
  • అవకాశం వచ్చినవారు శాఖాపరమైన పరీక్షలతో పోస్టుమెన్, మెయిల్‌ గార్డు, క్లర్క్‌.. మొదలైన పదోన్నతులు పొందవచ్చు.

11. ఆర్‌బీఐ:

  • రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆఫీస్‌ అటెండెంట్‌ విభాగంలో ప్యూన్, దర్వాజ్, మజ్దూర్‌ పోస్టులను భర్తీ చేస్తుంది.
  • వయసు 18-25 ఏళ్లలోపు ఉండాలి.
  • పరీక్షతో నియామకాలుంటాయి.
  • ఉద్యోగంలో చేరినవారు సీనియర్‌ ఆఫీస్‌ అటెండెంట్‌గా పదోన్నతి పొందవచ్చు.
  • డిగ్రీ పూర్తయితే శాఖాపరమైన పరీక్షలతో అసిస్టెంట్‌ స్థాయి దక్కుతుంది.

12. కేంద్రీయ ఆర్మ్‌డ్‌ దళాలు:

  • ఐటీబీపీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌.. తదితర కేంద్రీయ ఆర్మ్‌డ్‌ దళాలు కానిస్టేబుల్‌ హోదాలో కుక్, వాషర్‌మన్, బార్బర్, వాటర్‌ క్యారియర్, సఫాయి కర్మచారి తదితర పోస్టులను విడిగా భర్తీ చేస్తున్నాయి.
  • వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
  • శారీరక సామర్థ్య, రాత, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి.

13. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు:

  • ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల్లో లేబర్‌ పోస్టులు, బ్యాంకులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్‌ పోస్టులకు పదో తరగతి సరిపోతుంది.

14. రాష్ట్ర అటవీ శాఖల్లో పోస్టులు:

  • రాష్ట్ర అటవీ శాఖల్లో బంగ్లా వాచర్‌ పోస్టులకు పదితో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రాతపరీక్ష, ఫిజికల్‌ టెస్టుల ప్రతిభతో నియామకాలు చేపడతారు.
  • వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
  • పురుషులకు 163 సెం.మీ., స్త్రీలకు 150 సెం.మీ. ఎత్తు అవసరం.

15. కండక్టర్‌ పోస్టులు:

  • ఏపీఎస్‌/టీఎస్‌ ఆర్‌టీసీల్లో కండక్టర్‌ పోస్టులను ఖాళీలు ఉన్నప్పుడు పదో తరగతి మార్కుల మెరిట్‌తో భర్తీ చేస్తారు.

16. డ్రైవర్‌ పోస్టులు:

  • పదో తరగతి విద్యార్హతతోపాటు హెవీ వెహికల్‌ మోటార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ.. మొదలైనవాటిలో డ్రైవర్‌ పోస్టులకు పోటీ పడవచ్చు.
  • ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ ఉద్యోగానికీ ఈ లైసెన్స్‌ ఉన్నవారు ప్రకటన వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంజినీరింగ్ అర్హతతో SAILలో 249 ఉద్యోగాలు - లక్షల్లో జీతం - అప్లై చేసుకోండిలా! - SAIL Recruitment 2024

8326 పోస్టులతో SSC భారీ నోటిఫికేషన్​ - టెన్త్​ పాసైతే చాలు - అప్లై చేసుకోండిలా! - SSC MTS Notification 2024

ఏడాదికి రూ.70 లక్షల వరకు శాలరీ- ఇండియాలో హైయెస్ట్​ పేయింగ్​ జాబ్స్ ఇవే!​ - Highest Paying Jobs In India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.