Shiva Balakrishna in ACB custody : ఉన్నతాధికారిగా ఉండి ఉద్యోగాన్ని అడ్డంపెట్టుకొని కోట్లు కూడబెట్టిన కేసులో కటకటాలపాలైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా ఇంఛార్జ్ శివబాలకృష్ణ (Rera Shiva Balakrishna Case) అక్రమాస్తులు, బినామీల వ్యవహారంపై కూపీ లాగేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. న్యాయవాది సమక్షంలో శివబాలకృష్ణను ప్రశ్నిస్తున్నారు. అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని న్యాయస్థానం ఇప్పటికే అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
HMDA Ex Director Shiva Balakrishna Suspended : ఈనెల 24, 25న శివబాలకృష్ణ ఇల్లు సహా బంధువులు, సన్నిహితుల నివాసాలు కలిసి మొత్తం18 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో భారీగా ఆస్తులతోపాటు విలువైన భూములు, విల్లాలు, ప్లాట్లకి చెందిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా రెండు ఇన్‌ఫ్రా సంస్థలకు అనిశా బృందాలు వెళ్లగా ఒకచోట అందుబాటులో లేరని తెలిపారు. కొత్తపేటలోని క్విఆరిజన్ స్పేస్ సంస్థలో తనిఖీలు చేశారు. కానీ బంజారాహిల్స్‌లోని సాయిసందీప్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌లో సోదాలు కుదరకపోవడంతో వారిని కార్యాలయానికి పిలిచి విచారించాలని అనిశా భావిస్తోంది. ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
HMDA Ex Director Shiva Balakrishna Case Updates : సోదాల్లో గర్తించిన 15 బ్యాంకు ఖాతాల లవాదేవీలపై ఏసీబీ అధికారులు అరా తీయనున్నారు. శివబాలకృష్ణ (HMDA Shiva Balakrishna) సహా అయన భార్య, కుమార్తె, కుమారుడు, అతని సోదరుడు నవీన్‌కుమార్ పేర్లపై బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో కొన్ని ఖాతాలకు లాకర్లు ఉన్నట్లు తెలిపారు. వాటిని వారి సమక్షంలో తెరిచేందుకు అధికారులు సిద్దమయ్యారు.
బాలకృష్ణకు జ్యూడిషియల్ రిమాండ్ - ఏసీబీ సోదాల్లో రూ.100 కోట్లకుపైగా ఆస్తులు
రెరా కార్యదర్శిగా ఉన్నా బాలకృష్ణ అక్రమ సంపాదన మొత్తం హెచ్ఎండీఏ కేంద్రంగా సాగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ ప్రణాళిక విభాగం డైరెక్టర్‌గా ఉంటూనే ఎంఏయూడీలో ఇంఛార్జ్ డైరెక్టర్‌గా కొనసాగారు. ఈ క్రమంలోనే హెచ్‌ఎండీఏ నుంచి దస్త్రాలను పంపించిన శివబాలకృష్ణ ఎంఏయూడీలో డైరెక్టర్ హోదాలో వాటికి ఆయనే జీవోలు ఇచ్చేవారు. రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, భువనగిరి, సంగారెడ్డి తదితర ఏడు జిల్లాల్లోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. ఆ విషయాలపై నిగ్గు తేల్చేందుకు అనిశా అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.
Rera Shiva Balakrishna Case Updates : అనుమతులు జారీచేసిన దస్త్రాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా బదిలీ అయినా పలు కీలక దస్త్రాలను అతని వద్దనే ఉంచుకున్నట్లు గుర్తించింది. బాలకృష్ణ ఎక్కువగా అనుమతులిచ్చిన భవన నిర్మాణ గుత్తేదారులను కార్యాలయానికి పిలిపించి విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
శివబాలకృష్ణను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయానికిమించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేయడం సహా ఆయన ఇంట్లో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శివబాలకృష్ణ అవినీతి చిట్టాతో పాటు కేసుకు సంబంధించిన నివేదికను సంబంధిత శాఖాధికారులకు ఏసీబీ పంపించడం సస్పెండ్ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హెచ్ఎండీఏ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.100 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు
గొర్రెల నిధుల గోల్‌మాల్‌పై ఏసీబీ లోతైన దర్యాప్తు - 2 కోట్ల నిధులకు పైగా దారి మళ్లినట్లు గుర్తింపు