Aasara Pensions in Telangana 2024 : తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వస్తే సాధారణ పింఛను రూ.4,000, దివ్యాంగ పింఛనును రూ.6,000 చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ హామీని ఈ నెల నుంచైనా అమలు చేస్తారనే భావనతో పింఛన్‌దారులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ నెల కూడా వారి ఆశలు ఆడియాశలు అయ్యే విధంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆసరా పింఛన్లను (Aasara Pensions) ఈ నెలలో పాత పంథాలోనే విడుదల చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
పాత తరహాలోనే పింఛన్లు : ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో అధికారులు నగదు జమ చేయనున్నారు. ప్రస్తుతం సాధారణ పింఛను రూ.2,016, దివ్యాంగ పింఛను రూ.3,016 వస్తోంది. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే సాధారణ పింఛను రూ.4,000, దివ్యాంగ పింఛనును రూ.6,000 చేస్తామని ప్రకటించింది. కానీ ఆ హామీ ఎప్పటి నుంచి నెరవేరుతుందనే స్పష్టత లేకపోవడంతో పాత తరహాలోనే పింఛన్లను విడుదల చేయనున్నారు.
దరఖాస్తు సమయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా - అయితే మీకు పింఛన్ రాదు!
Old Aasara Pensions Telangana : తెలంగాణలో ప్రస్తుతం 15,98,729 మంది వృద్ధులు, 5,03,613 మంది దివ్యాంగులు, 15,60,707 మంది వితంతువులు, బీడీ కార్మికులు 4,24,585 మంది, చేనేత కార్మికులు 37,145, హెచ్‌ఐవీ బాధితులు 35,998, ఒంటరి మహిళలు 1,42,394, గీత కార్మికులు 65,307, ఇలా వివిధ వర్గాలవారు మొత్తం 43,96,667 మంది పింఛన్లు అందుకుంటున్నారు. వీరికోసం ప్రతినెలా రూ.1000 కోట్లు ఖర్చవుతోంది. కొత్త పింఛన్ల కోసం తాజాగా 24.84 లక్షల అర్జీలు వచ్చాయి. ఇప్పటికే 44 లక్షల మంది పింఛనుదారులు ఉండగా, కొత్తవాటిని ఆమోదిస్తే ఆ సంఖ్య 69 లక్షలకు చేరే అవకాశం ఉంది.
Congress Six Guarantees in Telangana : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను (Congress Six Guarantees) ప్రకటించింది. ఇందుకోసం మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహజ్యోతి పథకం, చేయూత పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకూ రెండు గ్యారెంటీలను అమలు చేసింది. అందులో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆరోగ్య బీమాను రూ.10 లక్షలకు పెంచింది.
Telangana Single Women Pension Scheme : ఒంటరి మహిళలకు పింఛన్.. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసా..?
Free Electricity Scheme in Telangana : మిగతా హామీల అమలు కోసం కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఐదు పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ పథకాల్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కూడా వినియోగదారుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ నెల బిల్లు చెల్లించాలా? వద్దా? అని వినియోగదారులు విద్యుత్‌శాఖ (Electricity Department) సిబ్బందిని అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించే వరకు బిల్లులు చెల్లించాల్సిందేనని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు విద్యుత్ సంస్థకు అందలేదని చెబుతున్నారు. దీంతో జనవరి బిల్లు మాత్రం కట్టాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు.
గ్యారంటీల అమలు జరిగేలా బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజాపాలన దరఖాస్తులు : భట్టి విక్రమార్క
రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీ అమలుకు ప్రతిపాదనలు సిద్ధం - వీరే అర్హులు!