ETV Bharat / state

విశాఖ ఎక్స్​ప్రెస్​లో ఘోరం - మహిళపై లైంగిక దాడి - Visakha Express Sexually Assaults - VISAKHA EXPRESS SEXUALLY ASSAULTS

Visakha Express Sexually Assaults : విశాఖ ఎక్స్​ప్రెస్​లో మహిళపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఇద్దరి మధ్య పెనుగులాట జరగడంతో మహిళ, నిందితుడు రైలునుంచి కిందకు పడిపోయారు. వారిని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Visakha Express Sexually Assaults
Visakha Express Sexually Assaults (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 10:20 PM IST

Updated : Jul 9, 2024, 11:08 PM IST

A Young Man Sexually Assaulted Young Woman in Visakha Express : విశాఖ ఎక్స్​ప్రెస్​ ట్రైన్​లో మద్యం మత్తులో ఓ యువకుడు ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో సదరు మహిళకు తీవ్రగాయాలయ్యాయి. రైల్వే పోలీసుల కథనం ప్రకారం, సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు మంగళవారం రాత్రి 7గంటలకు మిర్యాలగూడ స్టేషన్‌కు చేరుకుంది.

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో లైంగిక దాడికి యత్నం : రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే ట్రైన్ స్పీడ్​ తగ్గింది. అదే సమయంలో ఎస్‌-2 బోగీలో ప్రయాణిస్తున్న ఓ మహిళ వాష్‌రూమ్‌ నుంచి తన సీటు వద్దకు వెళ్తుండగా డోర్‌ వద్ద మద్యం మత్తులో ఉన్న ఒడిశాకు చెందిన బిశ్వాస్‌, ఆమెతో అసభ్యకరంగా నడుమ పట్టుకుని కిందకు లాగాడు. ఈ క్రమంలో ప్రయాణికురాలు రైలు నుంచి జారి కిందపడిపోయింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత బిశ్వాస్‌ కూడా ట్రైన్​ నుంచి కిందపడ్డాడు. గాయపడిన బాధితురాలు సమీపంలోని తండా వద్దకు నడుచుకుంటూ వెళ్లి స్థానికులకు జరిగిన విషయం చెప్పింది.

వారు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా, రైల్వే ఎస్‌ఐ పవన్‌ కుమార్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని బాధిత మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా రైలు పట్టాలపై కొంత దూరంలో మద్యం మత్తులో పడి ఉన్న బిశ్వాస్‌ను మరో అంబులెన్స్‌ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆమె శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్​గా పనిచేస్తున్నట్లు సమాచారం.

రైల్వే పోలీసులు ఇలాంటి ఘటనల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. రైల్వేలో మహిళా ప్రయాణికులు ఉన్నచోట నిఘా ఎక్కువగా పెంచాలని అధికారులు సూచించారు. ఇప్పటికే ఉన్న రైల్వే సిబ్బంది పహారా కాస్తున్నా దోపిడీలు ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇంతకు ముందు తిరుపతి నుంచి కాచిగూడ వస్తున్న ఓ కానిస్టేబుల్​ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ హోంగార్డును అరెస్టు చేశారు. ఇప్పుడు ఇలా జరగడంతో రైల్వే పోలీసులు అప్రమత్తం అయ్యారు. దూర ప్రయాణాలు చేసే ముఖ్యంగా మహిళా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

తల్లిదండ్రులు తిట్టారని ఇంటినుంచి బయటకొచ్చిన మైనర్ - మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన రాపిడో డ్రైవర్ - Girl Raped by Rapido Driver in ts

బాత్రూమ్​లో ప్రసవించిన రేప్​ బాధితురాలు- కవర్​లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన యువతి - Newborn Found Dead on Road

Last Updated : Jul 9, 2024, 11:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.