ETV Bharat / state

'నా వాటా ఇచ్చాకే అంత్యక్రియలు' : కుమారుడి నిర్వాకంతో 3 రోజులుగా శవపేటికలోనే తండ్రి మృతదేహం - SON OBSTRUCTS FATHER FUNERAL

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆస్తి కోసం కన్నతండ్రి అంత్యక్రియలు ఆపిన కుమారుడు - కుటుంబ వాటాలో రావాల్సిన ఆస్తిని ఇవ్వాలంటూ గొడవ

Son Obstructs Father Funeral
Son Obstructs Father Funeral In Yadadri (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2024, 2:27 PM IST

Updated : Nov 23, 2024, 3:09 PM IST

Son Obstructs Father Funeral In Yadadri : మానవ సంబంధాలన్నీ నేడు డబ్బు సంబంధాలుగా మారిపోయాయి. అలా డబ్బే ముఖ్యం అనుకుంటూ కన్నవాళ్లను కూడా పట్టించుకోవట్లేదు. తానే ప్రపంచం అనుకొని నాన్న చిన్నప్పుడు ఒక పూట తినకున్నా, తన పిల్లలను చదివించుకొని ప్రయోజకులను చేస్తాడు. కానీ పిల్లలు పెద్దయ్యాక ఆస్తుల కోసం తల్లిదండ్రులనే వదిలేస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆస్తి పంపకాలు తేలేవరకు తండ్రి దహన సంస్కారాలు చేయనని కుమారుడు నిరాకరించారు. అంత్యక్రియలు జరపకుండా 3 రోజులు శవపేటికలోనే ఉంచారు. బిడ్డలున్నా అనాథగా తండ్రి మృతదేహాన్ని వదిలేయడం స్థానికుల హృదయాల్ని కలచివేసింది.

వివరాల్లోకి వెళ్తే : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం సదర్​షాపురానికి చెందిన ఆలకుంట్ల బాలయ్య (62) అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతి చెందాడు. మృతినికి భార్య లింగమ్మ, కుమారులు నరేష్, సురేష్, కుమార్తెలు శోభ, సోని ఉన్నారు. తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో మృతుని భార్య లింగమ్మ తన అన్న రాములు ఇద్దరు కలిసి 30 సంవత్సరాల క్రితం 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో అర ఎకరం భూమి విక్రయించారు. లింగమ్మకు రావాల్సిన ఒక ఎకరం 10 గుంటల భూమిని రాములు తన కుమార్తె లింగమ్మ, బాలయ్య పెద్ద కోడలు (నరేష్ భార్య అరుణ)కు పట్టా చేసి ఇచ్చాడు.

దీంతో చిన్న కుమారుడు సురేష్ తనకు కూడా ఆ భూమిలో వాటా రావాలని అభ్యంతరం తెలపడంతో గత 3 రోజులుగా శవాన్ని శవపేటికలోనే ఉంచారు. దహన సంస్కారాలు నిలిపి వేయడంతో గ్రామస్థులు, బంధువులు, మృతుని కుమార్తెలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అంతిమ సంస్కారాలు జరపకపోతే బాలయ్య కుమార్తెలు కార్యక్రమాన్ని జరపడానికి సిద్దమయ్యారు. తన భూమి తేలకపోతే అంతిమ సంస్కారం జరపవద్ధని చిన్న కుమారుడు అనడంతో గ్రామ పెద్దలు ఇరువురిని కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించారు. తండ్రి చనిపోతే చిన్న కుమారుడు వ్యవహరించిన తీరుపై గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇంటి సమస్యను పరిష్కరించుకునే విధానం ఇలా కాదన్నారు.

ఊరంతా ఒక్కటై అంత్యక్రియలు నిర్వహించారు - ఎవరికో తెలిస్తే షాక్ అవుతారు

ఆస్తుల పంచాయితీ తెగక 2 రోజులుగా ఇంట్లోనే తల్లి మృతదేహం - చివరకు పెద్ద మనుషుల రంగప్రవేశంతో - Inhuman Incident Suryapet District

Last Updated : Nov 23, 2024, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.