A person who won a liquor store in lottery was kidnapped : లాటరీలో మద్యం దుకాణం దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్‌కు గురైన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. పుట్టపర్తిలో జిల్లా కలెక్టర్ చేతన్ అధ్యక్షతన మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ ఈరోజు ఉదయం జరిగింది. ఈ సందర్భంగా హిందూపూర్ డివిజన్ సంబంధించిన లాటరీలో చిలమత్తూరులోని 57వ నెంబర్ దుకాణాన్ని రంగనాథ అనే వ్యక్తి దక్కించుకున్నాడు. లాటరీ పూర్తిగానే వెలుపలికి వచ్చిన మద్యం వ్యాపారి రంగనాథను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న రంగనాథ్ భార్య అశ్విని పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
మద్యం దుకాణాల దరఖాస్తుల ఆదాయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
జిల్లా కలెక్టర్ చేతన్ అధ్యక్షతన మద్యం షాపులు ఎంపిక జరిగింది. జిల్లాలోని 87 మద్యం షాపులకు 1074 అప్లికేషన్లు రాగా 87 మంది లాటరీ ద్వారా ఎంపికయ్యారు. అందులో మహిళలు 60 మంది ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ సజావుగా సాగిందని తెలిపారు. లాటరీ ద్వారా ఎంపికకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. మద్యం షాపులకు ఎంపికైన వారు 48 గంటల్లో డబ్బులు కట్టాలని తెలిపారు. జిల్లాలో మద్యం షాప్ ఎంపిక ప్రక్రియలో లాటరీ ద్వారా మొదటి స్థానానికి ప్రాముఖ్యత కల్పించామన్నారు. తరువాత రెండో స్థానం. తదుపరి మూడో స్థానం కేటాయించామన్నారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే మొదటి స్థానం తర్వాత రెండవ స్థానానికి కేటాయించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
"ఇదేందయ్యా ఇదీ!" ఆ దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు - మద్యం టెండర్లలో రింగ్ ?
అక్కడ లిక్కర్ లెక్కే వేరు - నూతన మద్యం షాపులకు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు