ETV Bharat / state

ఇంతకన్నా దారుణం ఉండదేమో! - ఊయలలో ఉండగానే 6 నెలల చిన్నారిపై తాతయ్య అత్యాచారం - Rape on Six Months Baby - RAPE ON SIX MONTHS BABY

Rape on Six Months Baby : ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ముక్కు పచ్చలారని ఆరు నెలల పసికందుపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

Rape on Six Months Baby in Vizianagaram
Rape on Six Months Baby in Vizianagaram (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 1:15 PM IST

Rape on Six Months Baby in Vizianagaram : మహిళలు, చిన్నారులపై అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలను అమల్లోకి తెస్తున్నా, వారికి రక్షణ లేకుండాపోతోంది. ముక్కు పచ్చలారని శిశువులపై సైతం అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఊయలలో ఉన్న ఆరు నెలల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన ఘటన తాజాగా విజయనగరం జిల్లాలో కలకలం రేపింది.

జిల్లాలోని రామభద్రాపురంలో ఆరు నెలల చిన్నారిపై వరుసకు తాత అయిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో చిన్నారికి రక్తస్రావమైంది. ఊయలలో ఉండగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రామభద్రాపురం మండలంలో శనివారం ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : చిన్నారిని తల్లి ఊయలలో వేసి గ్రామంలోని కిరాణా దుకాణానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని ఈ సమయంలో నార్లవలస గ్రామానికి చెందిన బోయిన ఎరకన్న దొర అక్కడికి వచ్చి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి గట్టిగా ఏడవటంతో చిన్నారి అక్క (పెద్ద కుమార్తె) అక్కడికి చేరుకుని వెంటనే తల్లికి సమాచారం అందించింది.

దారుణం!! 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం - ఆపై కాల్వలోకి తోసి? - 8 YEAR OLD GIRL RAPE IN NANDYALA

ఈ క్రమంలో తల్లితో పాటు గ్రామస్థులు నిందితుడిని పట్టుకునేందుకు వెంబడించగా అతడు పరారయ్యాడు. అనంతరం చిన్నారిని బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. డీఎస్పీ శ్రీనివాసరావు ఆ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నార్లవలస వెళ్లి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

కూల్​డ్రింక్​లో మత్తు మందు కలిపి యువతిపై అత్యాచారయత్నం - బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరి అరెస్ట్ - 2 Members Arrested In Rape Case

పక్కింట్లో ఉన్న బాలికపై 4 నెలలుగా అత్యాచారం - నిందితుడిపై పోక్సో కేసు నమోదు - Rape on Minor Girl

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.