ETV Bharat / state

భార్యపై అనుమానంతో కుమార్తెను పొట్టనపెట్టుకున్న కసాయి - FATHER KILLED HIS DAUGHTER - FATHER KILLED HIS DAUGHTER

A Father Killed his Daughter in Anantapur District : భార్యపై అనుమానంలో కన్న కుమార్తెనే చేతులార చంపుకున్నాడో దుర్మార్గుడు. పుట్టిన బిడ్డ తన రక్తం పంచుకొని పుట్టాలేదనే అనుమానంతో మానవత్వం మరచి అభంశుభం తెలియని ఆరేళ్ల బాలికను గొంతు నులిమి చంపి బావిలో పడేశాడు. ఈ హృదయ విషాదకర ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

A Father Killed his Daughter in Anantapur District
A Father Killed his Daughter in Anantapur District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 8:18 PM IST

Updated : Jun 23, 2024, 7:09 PM IST

A Father Killed his Daughter in Anantapur District : భార్యపై అనుమానంతో కన్న కుమార్తెనే చంపాడు ఓ కసాయి. అభంశుభం తెలియని ఆరేళ్ల బాలికను గొంతు నులిమి చంపి బావిలో పడేసిన ఈ విషదకర ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జిల్లాలోని నార్పల మండల కేంద్రానికి చెందిన పావని(6) ఈ నెల 20వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదని, బాలిక తండ్రి గణేష్‌ నార్పల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సై రాజశేఖర్‌రెడ్డి, సీఐ శ్రీధర్‌ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పావని ఆచూకీ కోసం పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపారు. చిన్నారి అదృశ్యం అయిన విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో జిల్లా ఎస్పీ గౌతమి శాలి సైతం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఎలాగైన ఈ కేసును చేధించాలని ఈరోజు (శనివారం) ఉదయం పోలీసులు గ్రామ శివార్లలో గాలింపు చేపట్టారు.

అశ్లీల వీడియోలకు అలవాటై కుమార్తెపై కన్నేసిన తండ్రి- దారుణంగా హతమార్చిన వైనం - Father Killed Daughter

భార్యపై అనుమానంతో కుమార్తెను పొట్టనపెట్టుకున్న తండ్రి : ఈ క్రమంలో బాలిక తండ్రి ఓ వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజలు బయటపడ్డాయి. తన భార్య ఎవరితోనే వివాహేతర సంబంధం పెట్టుకుందని నిందితుడు పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం పుట్టిన బిడ్డ తన రక్తం పంచుకొని పట్టాలేదని, తను నా కుమార్తె కాదని వివరించాడు.

అందుకే పావనిని చంపేశానని పోలీసులకు వెల్లడించాడు. పథకం ప్రకారం ఈ నెల 20 తేదీన పావని పాఠశాల టైం ముగిసిన తరువాత ఇంటికి తీసుకురావడానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడి నుంచి నార్పల బస్టాండ్ వద్ద ఉన్న గుడ్ల బావి దగ్గర పాపకు ఈత నేర్పిస్తానని చెప్పి, తనను తీసుకు వెళ్లినట్లు చెప్పాడు. అనంతరం బాలిక గొంతు నులిమి చంపి బావిలో పడేసినట్లు గణేష్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.

బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరు : దీంతో పోలీసులు ఆ బావి వద్దకు హుటాహుటిన చేరుకొని బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. అప్పటికే మృతి చెందిన బాలికను పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని అనంతపురం తరలించారు. చిన్నారి హత్య విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. అభంశుభం తెలియని చిన్నారిని పొట్టన పెట్టుకున్నాడని వాపోయారు. ఇలాంటి కసాయి తండ్రిని ఉరితీయాలని కోరారు.

నల్లగా ఉందని ఊపిరాడకుండా చేసి 18 నెలల పసిబిడ్డ హత్య! - father killed daughter

కడప జిల్లాలో దారుణం - మద్యం మత్తులో సొంత కుమారుడిని గొంతు నులిమి చంపిన తండ్రి - Father Kills Son

Last Updated : Jun 23, 2024, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.