ETV Bharat / state

వరద నీటిలో తిరిగిన బాలుడు - కుడి కాలు తొలగింపు - ఎందుకో తెలుసా? - Necrotizing Fasciitis Disease

Necrotizing Fasciitis Disease :అత్యంత అరుదుగా వచ్చే 'నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌' వ్యాధితో 12 ఏళ్ల భవదీప్‌ బాధపడుతుండటంతో ఆ చిన్నారి కుటుంబం తల్లడిల్లిపోతోంది. భవదీప్‌ శరీరంలోకి ప్రమాదకర బ్యాక్టీరియా చొచ్చుకుపోయి తినేయడంవల్ల కుడి కాలును తొడ భాగం వరకు తొలగించారు. ఎడమ మోకాలి కింద భాగంలో ముప్పై శాతం మేర కండను కూడా సూక్ష్మక్రిములు తినేశాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

Necrotizing Fasciitis Disease
Necrotizing Fasciitis Disease (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2024, 7:46 AM IST

Necrotizing Fasciitis Disease :అత్యంత అరుదుగా వచ్చే 'నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌ (Necrotizing Fasciitis Disease)' వ్యాధితో 12 ఏళ్ల భవదీప్‌ బాధపడుతుండటంతో ఆ చిన్నారి కుటుంబం తల్లడిల్లిపోతోంది. సాధారణంగా మధుమేహ రోగుల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి చిన్నపిల్లల్లోనూ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. శరీరంపై ఎటువంటి గాయాలు లేకుండానే భవదీప్‌ శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ప్రవేశించడం వైద్యులనూ విస్మయానికి గురిచేస్తోంది. భవదీప్‌ శరీరంలోకి ప్రమాదకర బ్యాక్టీరియా చొచ్చుకుపోయి తినేయడంవల్ల కుడి కాలును తొడ భాగం వరకు తొలగించారు. ఎడమ మోకాలి కింద భాగంలో ముప్పై శాతం మేర కండను కూడా సూక్ష్మక్రిములు తినేశాయి. నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌ జబ్బుకు మరో పేరు ఫ్లెష్‌ ఈటింగ్‌ డిసీజ్‌. విజయవాడలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న భవదీప్‌కు అందించే వైద్యానికి అవసరమైన ఖర్చు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (Chief Minister Relief Fund) నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షలు మంజూరు చేసింది.

కుడి కాలును తొడ వరకు తొలగింపు : ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన భవదీప్‌ కుటుంబం ఉండే ఇంట్లోకి ఈ నెల తొలి వారంలో వరద నీరు వచ్చింది. మరుసటి రోజు నీరు తగ్గే వరకు ఆ బాలుడు నీటిలోనే ఉన్నాడు. చిన్నచిన్న పనులు కూడా చేశాడు. అదే రోజు రాత్రి నుంచి వణుకు, చలి, జ్వరం వచ్చింది. స్థానికంగా చికిత్స చేయించుకున్నాడు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. డెంగీ బారినపడినట్లు గుర్తించారు. తొడల నుంచి అరికాళ్ల వరకు వాపులు వచ్చాయి. దీంతో విజయవాడలోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. కాళ్ల కండరాలను సూక్ష్మక్రిములు తినేశాయని వైద్యులు గుర్తించారు. ఈ నెల 17న శస్త్ర చికిత్స చేసి కుడి కాలును తొడ వరకు తొలగించారు.

అలా చేయకూడదు : శరీరంలోకి సూక్ష్మ క్రిములు ఎలా ప్రవేశించాయి? అంత వేగంగా కాళ్ల కండరాలను ఎలా తినేశాయన్నదానిపై వైద్యులు కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. బాలుడికి చికిత్స అందిస్తోన్న అంకుర ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ వరుణ్, డాక్టర్‌ రవి మాట్లాడుతూ బాలుడి శరీరంలో కుళ్లిన భాగాల నుంచి తీసిన నమూనాలను పరీక్షలు చేయించడంతో శరీరంలోకి ఈ-కోలి, క్లెబిసెల్లా సూక్ష్మక్రిములు వెళ్లినట్లు తేలిందని అన్నారు. ఈ క్రిముల్లోనూ ప్రమాదకర జాతులు ఉంటాయని, అవి శరీరంలోకి వెళ్లడం వల్లే, కాళ్లు బాగా వాచాయని తెలిపారు.

వరద నీటిలో మురుగు నీరు కలుస్తుంటుందని, అప్పుడు బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో బ్యాక్టీరియా శరీరంలోకి చేరి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. జ్వరంతో ఉన్న సమయంలో భవదీప్‌ను తల్లిదండ్రులు స్థానిక ఆర్‌ఎంపీకి చూపించారని తెలిపారు. అక్కడ యాంటీబయాటిక్, స్టెరాయిడ్‌ ఇంజక్షన్లను కండ (పిరుదు)కు ఇచ్చారని, ఇలా చేయకూడదని అన్నారు. కాళ్ల వాపులు గమనించిన వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. ప్రస్తుతం ఐసీయూలో భవదీప్‌ ఎడమ కాలి భాగం ఇప్పుడిప్పుడే నయమవుతోందని పూర్తిగా కోలుకునేందుకు రెండు, మూడు నెలల వరకు సమయం పడుతుందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.