10th class exams started from today: ఏపీలో ఒవైపు ఎన్నికల కోలాహలం, మరోవైపు పరీక్షల హడావిడి మెుదలైంది. ఇప్పటికే మార్చి 15వ తేదీన ఇంటర్ పరీక్షలు ముగియగా నేటి నంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల నిర్వాహణ కోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు: ఆంధ్రప్రదేశ్‌లోనూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో 6 లక్షల23వేల 92 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గతంలో పదో తరగతి ఫెయిల్ అయి, మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించిన వారు లక్షా 2వేల 528 మంది ఉన్నారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల రికార్డు మధ్యే పదో తరగతి ప్రశ్నపత్రాల సీల్స్ తెరుస్తారు.
ముగిసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ - ఒంగోలులో కాపీ చేస్తూ పట్టుబడిన అభ్యర్థి
అమలులో 144 సెక్షన్: పోలీసుస్టేషన్లకు దూరంగా ఉన్న ఎగ్జామ్ సెంటర్లకు పోలీసుల భద్రత నడుమ ప్రశ్నపత్రాలను తరలిస్తారు. పరీక్ష కేంద్రంలో ఎవరైనా అస్వస్థతకు గురైతే చికిత్స అందించేందుకు ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచారు. పదో తరగతి పరీక్షలు జరిగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్ష ముగిసే వరకూ ఆ చుట్టుపక్కల జిరాక్స్, కంప్యూటర్ సెంటర్లను అధికారులు మూసేయిస్తారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు రావాలని అధికారులు సూచించారు. ఆయా పరీక్ష కేంద్రాల దగ్గర డీఈవో, ఎంఈవోల సెల్‌ఫోన్ నంబర్లను ప్రదర్శిస్తారు.
ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం: మాల్ ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్లు ముద్రించారు. ఇన్విజిలేటర్లు, డిపార్టుమెంటల్ అధికారులు, ఇతర సిబ్బంది ఫోన్లను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా నిషేధించారు. విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. విద్యార్థులు వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చనీ, వాటిపై ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకపోయినా, పరీక్షకు అనుమతించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పరీక్షల విభాగంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కంట్రోల్ విభాగం ఈ నెల 30 వరకు పని చేస్తుంది. విద్యార్థలకు ఎలాంటి సందేహాలు ఉన్నా 0866-2974540 నంబరులో సంప్రదించాలని విద్యాశాఖల అధికారులు పేర్కొన్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో తప్పులు - ‘అతివాద దశ’ బదులుగా తీవ్రవాద దశ!