ETV Bharat / state

నగరంలో వందకు పైగా నకిలీ డాక్టర్లు - వాళ్లు చేయి పట్టుకున్నారంటే! - FAKE DOCTORS IN HYDERABAD

హైదరాబాద్​లో రోజురోజుకూ పెరగుతున్న నకిలీ వైద్యులు - బస్తీలు, శివారు ప్రాంతాల్లో ఆస్పత్రులు

Fake Doctors in Hyderabad
Fake Doctors in Hyderabad (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2024, 11:12 AM IST

Fake Doctors in GHMC : హైదరాబాద్​ నగరం నకిలీ వైద్యులకు అడ్డాగా మారుతోంది. అర్హత లేకున్నా నాడి పట్టి నకిలీ వైద్యులుగా చెలామణి అవుతున్నారు. మరోవైపు రోగుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇలా మాయగాళ్లు మహానగర వ్యాప్తంగా విస్తరించారు. ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో ఇప్పటివరకు 100 మంది ఫేక్ డాక్టర్స్ గుట్టు బయటపడింది. తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ తనిఖీల్లో ఎలాంటి ఎంబీబీఎస్‌ ఇతర వైద్య పట్టాలు లేకుండానే ప్రాక్టీస్ చేస్తున్నట్లు నిర్ధారించారు.

కొన్ని ఉదాహరణలు :

  • డెంటల్‌ డిగ్రీ పొందిన ఓ వైద్యురాలు నాగోలులో ఎస్‌జేఎం పేరుతో క్లినిక్‌ తెరిచింది. అక్కడ ఏకంగా చర్మ వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. డెర్మటాలజిస్టులు చేయాల్సిన కాస్మటాలజీ వైద్యం, హెయిర్‌ ట్రాన్స్‌పాంట్‌ ఈమె చేస్తున్నట్లు అధికారుల సోదాల్లో తేలింది.
  • తిరుమలగిరిలో శ్రీసాయి క్లినిక్‌ పేరుతో ఓ నకిలీ వైద్యుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. రోగులకు యాంటిబయోటిక్‌ ఇంజక్షన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నాడు. అతనిపై కేసు నమోదు చేశారు.
  • విదేశాల్లో ఎంబీబీఎస్‌కి సమానమైన వైద్యవిద్యను ఓ వ్యక్తి అభ్యసించాడు. ఇక ఏకంగా ఎండీ బోర్డు పెట్టి, చర్మ వ్యాధి నిపుణుడిగా చలామణి అవుతున్నారు.

కాస్త అనుభవంతో : డాక్టర్లుగా చెలామణి అవుతున్న ఈ నకిలీ వైద్యుల వద్ద ఎలాంటి పట్టాలు లేవు. కొందరు నకిలీ పట్టాలు సృష్టించి వాటిని లామినేషన్‌ చేయించి క్లినిక్‌ల్లో పెడుతున్నారు. మరి కొందరైతే ఏవో గుర్తింపు లేని విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు కొనుగోలు చేసి డాక్టర్లుగా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. మెడికల్‌ షాప్స్​ కూడా పెట్టించి అనుమతులు లేకుండానే మెడిసిన్స్ విక్రయిస్తున్నారు. దాదాపు 140 వరకు ఇలాంటి దుకాణాలను ఔషధ నియంత్రణశాఖ నిర్ధారించింది.

హోల్‌సేల్‌ డీలర్లు సైతం ఇలాంటి క్లినిక్‌లకు మెడిసిన్స్ సరఫరా చేస్తున్నారు. బస్తీలు, మురికి వాడలను లక్ష్యంగా చేసుకొని క్లినిక్‌లను తెరుస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కన్సల్టెంట్‌ ఫీజులు రూ.500 నుంచి రూ.1500 వరకు ఉండటంతో ఈ నకిలీ వైద్యులు రూ.50, రూ.100 వసూలు చేస్తుండటంతో పేదలు ఎక్కువ మంది వీటిని ఆశ్రయిస్తున్నారు.

అధిక మోతాదుతో కూడిన ఔషధాలు : ఈ క్లినిక్‌లకు వెళ్లిన రోగులకు నకిలీ వైద్యులు అవగాహన లేక అధిక మోతాదుతో కూడిన మెడిసిన్స్ సిఫార్సు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హై యాంటిబయోటిక్స్‌తో అప్పటికప్పుడు రోగం నయం అయినట్లు అనిపిస్తుంది. కానీ దీర్ఘకాలంలో అది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కీళ్ల నొప్పులు ఇతర సమస్యలకు స్టెరాయిడ్లు ఇస్తున్నారు.

జాగ్రత్త సుమా : చట్టప్రకారం అర్హత లేని వ్యక్తులు క్లినిక్‌లు తెరవడం, ప్రాక్టీసు చేయడం నేరమని నీట్రీజీఎంసీ వైస్‌ఛైర్మన్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ తెలిపారు. ఎన్‌ఎంసీ చట్టం 34, 35 ప్రకారం వీరిపై కేసు నమోదవుతుందని చెప్పారు. టీజీఎంసీ ఆధ్వర్యంలో నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో 30 బృందాలు తనిఖీలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ వివరించారు.

'పది' పాస్‌ కాలేదు కానీ.. పదేళ్ల నుంచి ‘డాక్టర్‌’గా..!

Fake Doctor: నాలుగేళ్లలో 43 వేల మందికి 'వైద్యం'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.