India WTC 2025: రోహిత్ సేన మరో సరికొత్త రికార్డు సృష్టించనుందా? మరోసారి ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ ఫైనల్ చేరనుందా? అని ప్రశ్నలు వస్తున్నాయి. అయితే వెస్టిండీస్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై సౌతాఫ్రికా గెలుపొందడం వల్ల ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టిక (WTC Points Table 2025)లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అటు తాజా విజయంతో సౌతాఫ్రికా ఐదో స్థానానికి చేరుకుంది. ఇక భారత్ ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 74 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
రెండో స్థానంలో ఆసీస్
90 పాయింట్లతో ఆసీస్ రెండో స్థానాన్ని సరిపెట్టుకుంది. ఆస్ట్రేలియాకు పాయింట్లు ఎక్కువే అయినప్పటికీ విజయాల శాతం భారత్‌కే అధికంగా ఉండటం వల్ల ఆసీస్ రెండో ప్లేస్‌కు పరిమితం కావాల్సొచ్చింది. ఇక భారత్ తదుపరి ఆడనున్న బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో జోరు కొనసాగిస్తే, డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరడం లాంఛనప్రాయమే అని చెప్పాలి! ఒకవేళ ఈ టోర్నీలో భారత్ ఫైనల్ చేరితే, ఐసీసీ ఈవెంట్లలో టీమ్ఇండియా వరుసగా నాలుగోసారి టైటిల్ ఫైట్ ఆడుతుంది. అయితే ఈ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడతాయి.
భారత్ విన్నింగ్ పర్సంట్ అదుర్స్
కాగా, ఇప్పటివరకు భారత్ 68.51, ఆస్ట్రేలియా 62.50 విన్నింగ్ పర్సంటేజ్ నమోదు చేశాయి. అలాగే న్యూజిలాండ్ ఆరు మ్యాచుల్లో మూడు గెలిచి, మూడు ఓడిపోయింది. 50 శాతం పీసీటీతో నిలిచింది. నాలుగో స్థానంలో శ్రీలంక, ఐదో ప్లేస్‌లో దక్షిణాఫ్రికా నిలిచింది. చివరి నాలుగు స్థానాల్లో పాకిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు నిలిచాయి.
40 పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలుపు
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. 40 పరుగుల తేడాతో విజకేతనం ఎగురవేసింది. తొలి ఇన్నింగ్‌లో 160 పరుగులకే ఆలౌట్ అయిన ప్రొటీస్ జట్టు ఆ తర్వాత బౌలింగ్ లో పుంజుకుంది. తొలి ఇన్నింగ్ లో విండీస్ ను 144 పరుగులకు కట్టడి చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ జేసన్ మాత్రమే దకిణాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. రెండో ఇన్సింగ్స్ లో ప్రొటీస్ జట్టు 246 పరుగులు చేసింది. ఈ క్రమంలో 263 పరుగుల లక్ష్యాన్ని విండీస్ జట్టుకు నిర్దేశించింది. ఆ తర్వాత సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు విండీస్ జట్టు 222 పరుగులకు కుప్పకూలింది. దీంతో విండీస్ 40 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇక టీమ్ఇండియా టార్గెట్ అదే - ఇప్పటికే రెండు సార్లు మిస్! - ICC World Test Championship
మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియానే నెం.1- ర్యాంకింగ్స్‌లో భారత్ డామినేషన్