ETV Bharat / sports

ఆరేళ్ల తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం - రంజీలోనూ మహిళలకు రెడ్‌బాల్ టోర్నీ! - మహిళల రంజీ ట్రోఫీ

Womens Red Ball Ranji Trophy : మహిళా క్రికెట్​ విషయంలో బీసీసీఐ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వారికి కూడా దేశవాళీ క్రికెట్‌లో రెడ్‌బాల్‌ మ్యాచ్‌లను నిర్వహించనుంది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 5:11 PM IST

Womens Red Ball Ranji Trophy : అన్ని ఫార్మాట్లతో పాటు దేశవాళీ క్రికెట్​ కూడా కీలకమని భావించిన బీసీసీఐ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పురుషుల్లాగే మహిళలకు కూడా రెడ్‌బాల్ క్రికెట్ టోర్నీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. పుణె వేదికగా మార్చి 28 నుంచి ఏప్రిల్ 11 వరకు సీనియర్‌ మహిళల ఇంటర్‌ జోనల్‌ టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఒక్కో మ్యాచ్‌ మూడు రోజుల పాటు జరగనుంది. అయితే 2018లో చివరిసారిగా రెండు రోజుల మ్యాచ్‌ను బీసీసీఐ నిర్వహించింది.

గతేడాది టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లతో ఏకైక టెస్టు మ్యాచ్‌లు ఆడింది. 2021లోనూ ఆ దేశాలకు వెళ్లిన సమయంలో సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ మహిళల జట్టు తలపడింది. రాబోయే కాలంలోనూ మరిన్ని టెస్టులను నిర్వహించాలంటూ బీసీసీఐ ఆలోచిస్తోంది. అందులోభాగంగా తాజాగా డొమిస్టిక్‌ క్రికెట్‌లోనూ ప్రాక్టీస్‌ కోసం రెడ్‌బాల్ మ్యాచ్‌లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం మహిళా క్రికెటర్లు డబ్ల్యూపీఎల్ మ్యాచుల్లో తమ సత్తా చాటుతున్నారు. ఇది మార్చి 17తో ముగుస్తోంది. మరో పది రోజుల తర్వాత ఇంటర్‌ జోనల్‌ టోర్నమెంట్‌ కూడా మొదలుకానుంది.

మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో ఈస్ట్‌ జోన్ X నార్త్‌ ఈస్ట్‌ జోన్, వెస్ట్‌ జోన్ X సెంట్రల్‌ జోన్‌ల మధ్య లీగ్‌ స్టేజ్‌లో మ్యాచ్​లు జరగనున్నాయి. మొత్తం 14 రోజులపాటు నిర్వహించనున్న ఈ టోర్నీలో నార్త్‌ జోన్‌, సౌత్ జోన్​లు నేరుగా సెమీస్‌లోనే ఆడనున్నాయి. ఇక లీగ్‌ స్టేజ్‌లో గెలిచిన రెండు జట్లతో అవి సెమీ ఫైనల్‌లో తలపడతాయి. మరోవైపు సెమీస్‌ మ్యాచ్‌లు ఏప్రిల్‌ 3న జరుగుతాయి. ఇక ఏప్రిల్ 9న ఫైనల్‌ జరగనుంది.

ఉత్కంఠభరితంగా డబ్ల్యూపీఎల్​ :
తాజాగా ఆర్​సీబీ- దిల్లీ మ్యాచ్​లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ హై స్కోరింగ్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్​కు ఫుల్ మజానిచ్చింది. ఇక టోర్నీలో వరుసగా రెండు విజయాలతో ఊపుమీదున్న ఆర్​సీబీ జోరుకు దిల్లీ బ్రేకులు వేసింది. తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఛేదనలో ఆర్​సీబీ దూకుడుగా ఆడుతూ ఓ దశలో గెలిచేలా కనిపించింది. కానీ, ఆఖర్లో దిల్లీ బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టి ఆర్​సీబీకి విజయాన్ని దూరం చేశారు.

WPLలో తెలుగమ్మాయిలు- వీరిలో సత్తా చాటేదెవరో?

గ్రాండ్​గా WPL ప్రారంభం- స్పెషల్ అట్రాక్షన్​గా బాలీవుడ్ స్టార్స్​ పెర్ఫార్మెన్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.