HarmanPreet Kaur IND VS PAK : ఈ మధ్య కాలంలో క్రమక్రమంగా మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్లేయర్స్ కూడా మంచి ప్రదర్శన చేస్తూ క్రికెట్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయినప్పటికీ మహిళా క్రికెట్‌కు అంతగా ప్రోత్సాహం దక్కట్లేదనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా దీనిపై భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.
మహిళా క్రికెట్‌కు అంతగా ప్రోత్సాహం దక్కలేదనే ఆందోళన ఉంది. భారత జట్టు బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లి వచ్చిన తర్వాత మీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు తక్కువమంది జర్నలిస్ట్‌లు వస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం చెప్పగలరా?
హర్మన్: (నవ్వుతూనే) మీ ప్రశ్న బాగుంది కానీ ఆ పని నాది కాదు. మీరే ఇక్కడికి వచ్చి మమ్మల్ని కవర్ చేయాలి. అంటూ సమాధానమిచ్చింది.
Womens Asia Cup 2024 : కాగా, మహిళల ఆసియా కప్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా(IND vs PAK) పోటీ పడనుంది. లంక ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలోని మ్యాచులన్నీ దంబుల్లా మైదానం వేదికగా జరగనున్నాయి. శుక్రవారం(జులై 19) రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంది. మాట్లాడింది. ఆ కాన్ఫరెన్స్‌లోనే మహిళా క్రికెట్‌కు సరైన మద్దతు దొరకడం లేదని ఓ రిపోర్టర్ ప్రశ్న వేశాడు. అయితే, ఆ ప్రశ్నను మొదట అర్థం చేసుకోవడంలో హర్మన్ కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించింది. అయోమయానికి గురైంది. అయితే దీన్ని చూసి పక్కనే ఉన్న లంక జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు నవ్వును ఆపుకోలేకపోయింది. దీంతో రిపోర్టర్ మరోసారి ఇదే ప్రశ్నను అడిగాడు. దానికే హర్మన్ తనదైన శైలిలో పై సమాధానం ఇచ్చింది.
ఎలా రాణిస్తారో? - ఇకపోతే ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను 1-1తో ముగించింది హర్మన్‌ప్రీత్ కౌర్ సేన. ఇప్పుడిదే ఊపులో ఆసియాకప్ బరిలో ఫేవరెట్‌గా దిగుతోంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మంచి ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. అయితే హర్మన్‌ప్రీత్, జెమీమా, దీప్తిశర్మ మాత్రం స్థిరంగా రాణించలేకపోతున్నారు. ఓపెనింగ్‌లో షెఫాలి వర్మ కూడా అడపాదడపా రాణిస్తోంది. బౌలర్లు కూడా ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. మరి ఈ ప్రతికూలతలను దాటుకుని భారత జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.