Without IPL Century: ఐపీఎల్ అంటేనే అభిమానులకు అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మజా ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరో రెండు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌కి తెరలేవనుంది. టైటిల్ వేటకు దిగడానికి అన్ని టీమ్‌లు సిద్ధమయ్యాయి. ఇప్పుడు జరగబోయేది 17వ సీజన్. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో, ఒక్క సెంచరీ కూడా కొట్టని ఆటగాళ్లు ఉన్నారు. వేలకు వేలు పరుగులు చేసినా వారి పేరు మీద ఒక్క సెంచరీ కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. మరి వాళ్లెవరో చూసేయండి
ఎంఎస్ ధోని (5082 పరుగులు): ఎంఎస్ ధోని 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 2024 సీజన్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అయితే ఈ లిస్ట్‌లో మొదటగా చెప్పుకోవాల్సింది ధోనీ గురించే. ధోనీ 16సీజన్‌లో ఇప్పటివరకూ 5000+ పరుగులు చేసినా, ఒక్కసారి కూడా 100 పరుగుల మార్క్ అందుకోలేదు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో సెంచరీ లేకుండా అత్యధిక పరుగులు చేసింది ధోనీనే కావడం గమనార్హం.
- మ్యాచ్‌లు: 250
- ఇన్నింగ్స్: 218
- అత్యధిక స్కోరు: 84
- యావరేజ్: 37.89
- స్ట్రైక్ రేట్: 135.92
ఫాఫ్ డుప్లెసిస్ (4133 పరుగులు): దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా భారీ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. 2012 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో కూడా బరిలో దిగుతున్నాడు. డు ప్లెసిస్‌కి 4 పరుగులతో సెంచరీ దూరమైంది. ఈసారైనా ఈ ఫీట్ అందుకుంటాడో లేదో చూడాలి.
- మ్యాచ్‌లు: 130
- ఇన్నింగ్స్: 123
- అత్యధిక స్కోరు: 96
- యావరేజ్: 36.9
- స్ట్రైక్ రేట్: 134.14
గౌతమ్ గంభీర్ (4218 పరుగులు): భారత్ మాజీ ఓపెనర్, కేకేఆర్‌కి ఐపీఎల్ ట్రోఫీ అందజేసిన గౌతమ్ గంభీర్ కూడా ఐపీఎల్‌లో భారీగా పరుగులు చేశాడు. కానీ ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు. ఏడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయింది. గంభీర్ కూడా 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. చివరి ఐపీఎల్ సీజన్ 2018లో ఆడాడు.
- మ్యాచ్‌లు: 154
- ఇన్నింగ్స్: 152
- అత్యధిక స్కోరు: 93
- సగటు: 31.01
- స్ట్రైక్ రేట్: 123.91
దినేష్ కార్తీక్ (4516 పరుగులు): ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో దినేష్ కార్తీక్ పేరు కూడా ఉంటుంది. ఈ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్, మిడిలార్డర్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో దిట్ట. దినేష్ కార్తీక్ కూడా ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఆడుతున్నాడు. ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి మ్యాచ్‌లు గెలిపించినా, తన పేరు మీద ఒక్క ఐపీఎల్ సెంచరీ కూడా లేదు. కేవలం మూడు పరుగుల దూరంలో ఆగిపోయాడు.
- మ్యాచ్‌లు: 242
- ఇన్నింగ్స్: 221
- అత్యధిక స్కోరు: 97
- యావరేజ్: 25.81
- స్ట్రైక్ రేట్: 132.71
రాబిన్ ఉతప్ప (4952 పరుగులు): రాబిన్ ఉతప్ప కూడా ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఆడుతున్నాడు. 2022లో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ విధ్వంసక ఇన్నింగ్స్‌లు చాలా ఆడినా, ఒక్క సెంచరీ కూడా చేయలేదు.
- మ్యాచ్‌లు: 205
- ఇన్నింగ్స్: 197
- అత్యధిక స్కోరు: 88
- యావరేజ్: 27.51
- స్ట్రైక్ రేట్: 130.35
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ధోనీ టు రైనా - ఐపీఎల్‌లో సిక్సర్ల వీరులు వీరే!
IPL టాప్ 10 వికెట్ల వీరులు వీరే - బ్యాటర్లను భయపెట్టేస్తారు!