India vs New Zealand First Test : టీమ్ ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ అక్టోబర్ 16న ప్రారంభం కానుంది. అయితే ఈ పోరుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం ఇబ్బంది పెట్టడం క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.
ఈ వర్షం కారణంగా బెంగళూరు వేదికగా ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ మరింత ఆలస్యమైంది. వర్షం పడుతుండటం వల్ల టాస్ కూడా వేయడం సాధ్యం కాలేదు. ఒక వేళ ఇప్పటికిప్పుడు వర్షం ఆగినా మైదానాన్ని వెంటనే సిద్ధం చేయడం కుదరదు. కనీసం అరగంట నుంచి గంట సమయ పట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతే టాస్ వేయడం కుదురుతుంది.
ఒకవేళ టాస్ వేసిన తర్వాత ఆట ప్రారంభం అవ్వాలంటే కనీసం 15 నుంచి 30 నిమిషాల సమయం తీసుకుంటారు. కాబట్టి తొలి రోజు మొదటి సెషన్ ఆట ఆడటం దాదాపు కష్టమేనని క్రికెట్ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు - ఈ సిరీస్‌లో భాగంగా జరగబోయే మూడు టెస్టు మ్యాచ్‌లు సాధారణంగా ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతాయి. కానీ ఇప్పుడు తొలి మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైంది. ఒకవేళ ఈ మ్యాచ్ ప్రారంభమైతే లైవ్‌లో స్పోర్ట్స్ 18 ఛానల్‌లతో వీక్షించొచ్చు. కలర్స్ సినీ ప్లెక్స్లోనూ చూడొచ్చు. ఆన్‌లైన్‌లో చూడాలనుకుంటే జియో సినిమాలో ప్రత్యక్షంగా చూడొచ్చు. జియో సినిమా వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా లైవ్‌ను చూడొచ్చు. మిగతా మ్యాచ్‌లను కూడా ఇవే ప్లాట్‌ఫామ్‌లలో వీక్షించొచ్చు.
India vs New Zealand First Test Squad - జట్లు (అంచనా)
భారత్: రోహిత్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్/సర్ఫరాజ్, కోహ్లి, పంత్, రాహుల్, జడేజా, అశ్విన్, ఆకాశ్‌దీప్/కుల్‌దీప్, బుమ్రా, సిరాజ్;
న్యూజిలాండ్: కాన్వే, లేథమ్, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మిచెల్, బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, బ్రాస్‌వెల్, సౌథీ, అజాజ్, ఒరూర్కె.
36 ఏళ్లుగా ఒక్క విజయం లేదు - భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టుల్లో ఎవరిది పైచేయి?
ఒక్క రోజులోనే కోహ్లీ సంపాదనను దాటేసిన మాజీ క్రికెటర్! - ఎవరంటే?