Ground Staff Touches Virat Feet : కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ గేమ్ ప్రారంభయ్యే ముందు ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. అక్కడి గ్రౌండ్ స్టాఫ్ ఒకరు మైదానంలోనే క్రికెటర్ విరాట్ కోహ్లీ కాళ్లు పట్టుకున్నారు. ఈ చర్యతో కోహ్లీతో పాటు అక్కడివారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
పని మానుకుని మరీ!
వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడగా, వెనువెంటనే కాన్పూర్ సిబ్బంది గ్రౌండ్‌ను మ్యాట్‌తో కప్పారు. అయితే వరుణుడు శాంతించిన తర్వాత మళ్లీ వారంతా ఆ మ్యాట్‌ను తొలగించేందుకు స్టేడియంలోకి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో ప్రాక్టీస్‌కు వెళ్తున్న విరాట్‌ను గమనించిన ఓ గ్రౌండ్ స్టాఫ్ అతడి వద్దకు వెళ్లి కోహ్లీ కాళ్లకు మొక్కాడు.
దీంతో విరాట్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఆ తర్వాత ఆ వ్యక్తి చేయి పట్టుకుని లేపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవ్వగా, నెటిజన్లు ఈ పోస్ట్‌పై రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఆ వ్యక్తి ప్లేస్‌లో మేము ఉంటే బాగున్ను అని ఒకరు అంటుంటే, మరొకరేమో అతడు అలా చేయడం విరాట్ ఇబ్బంది పడ్డాడేమే అని అంటున్నారు. ఇంకొకరరేమో లక్కీ ఫ్యాన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
When Virat came out, a ground staff member touched his feet🥹❤️#ViratKohli | #IndvsBan pic.twitter.com/y35ADdW0Kx
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) September 27, 2024
ప్రస్తుత జరుగుతున్న ఈ రెండో టెస్టులో టాస్ నెగ్గిన టీమ్‌ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఇప్పటికే ఈ రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసేసి టీ20 సిరీస్‌కు వెళ్లాలనే లక్ష్యంతో టీమ్‌ఇండియా ముందుకు సాగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని బంగ్లా చూస్తోన్నట్లు తెలుస్తోంది.
ఇక తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి బంగ్లా 26 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు స్కోర్ చేసింది. కెప్టెన్ నజ్ముల్ శాంటో (31), మొమినల్ హక్ (40) దూకుడుగా ఆడారు. ఈ ఇద్దరూ మూడో వికెట్ సమయానికి 45 పరుగులు జోడించారు. అయితే భారత పేస్‌ను అడ్డుకొని బంగ్లా బ్యాటర్లు నెమ్మదిగా పరుగులు రాబడుతున్నారు. అంతకుముందు ఓపెనర్లుగా దిగిన షద్మాన్ ఇస్లామ్ (24), జకీర్ హసన్ (0)ను యువ బౌలర్ ఆకాశ్ దీప్ ఔట్ చేశాడు.
పరిస్థితులు మారిపోయాయి, అప్పుడే తుది జట్టు చెప్పలేను : అసిస్టెంట్ కోచ్ - Ind vs Ban 2nd Test