Virat Kohli T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముగిసి మూడు రోజులు అయ్యింది. కానీ క్రికెట్ అభిమానులు మాత్రం ఇంకా అదే ఫీవర్‌లో ఉన్నారు. ఫ్యాన్సే కాదు క్రికెటర్లు కూడా ఆ హ్యాపీ మూమెంట్స్‌ను ఆస్వాదిస్తున్నారు. మరికొందరేమో పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా బార్బడస్ స్టేడియంలో తాను రోహిత్‌తో తీసుకున్న ఓ ఫొటో గురించి ప్రస్తావించి ఎమోషనలయ్యారు. ఆ ఫొటో తీసుకొనడానికి వెనక ఉన్న కథను వివరించారు.
మ్యాచ్ గెలుపు తర్వాత సంబరాల్లో ఉన్న రోహిత్ సేన, తమ ఆత్మీయులతో కలిసి ఆ సంతోషాన్ని పంచుకుంటూ కనిపించారు. ఈ ఆనంద క్షణాలను అక్కడి కెమెరా మెన్లు కూడా క్లిక్‌మనిపించారు. సరిగ్గా అప్పుడే రోహిత్, కోహ్లీ జాతీయజెండాను తమ భుజాలపై కప్పుకుని ట్రోఫీతో ఫొటో దిగారు. ఆ తర్వాత రోహిత్ శర్మ తన కుమార్తె ను భుజాలపైకి ఎత్తుకుని, విరాట్‌తో ఫోటో దిగాడు. అయితే ఈ ఐకానిక్ ఫొటో దిగడానికి గల కారణాన్ని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. వరల్డ్ కప్‌తో ఇద్దరం కలిసి ఫొటో దిగుదామని రోహిత్‌ను అతడే కోరినట్లు కోహ్లీ వివరించాడు.
"టీ20 వరల్డ్ కప్ గెలవడం నాకే కాదు, రోహిత్‌కు కూడా ఎంతో స్పెషల్. తన ఫ్యామిలీ ఇక్కడ ఉంది. సమైరా (రోహిత్ కుమార్తె) అతడి భుజాలపై ఉంది. ఈ విజయానికి వెనక రోహిత్ కృషి ఎంతో ఉంది. కాసేపు ట్రోఫీని పట్టుకోమని అతని (రోహిత్)కి నేనే చెప్పాను. మా ఇద్దరి ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. అందుకే ఈ ఫొటో దిగాం" అంటూ ఎమోషనలయ్యాడు.
Dear Virat Kohli,
— Dhruv³ (@Rohitinveins) July 1, 2024
You won my heart where you gone to Rohit and told him for one photo with that background of Indian flag. 🥺🫂 pic.twitter.com/MTjZV77AeA