ETV Bharat / sports

విరాట్ దెబ్బకు షారుక్​ ఒక్కసారిగా షాకయ్యాడుగా! - IPL 2024 - IPL 2024

Virat Kohli RCB : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా శనివారం (మే 4)ను గుజరాత్ టైటాన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ షారుక్ ఖాన్​కు ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చుక్కలు చూపించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Virat Kohli RCB
Virat Kohli RCB (Source : ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 8:55 AM IST

Virat Kohli RCB : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా శనివారం (మే 4)ను గుజరాత్ టైటాన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరులో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. మ్యాచ్​లో చాలా దూకుడుగా ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ షారుక్ ఖాన్​కు ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చుక్కలు చూపించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్​లోని 13 ఓవర్​ను ఆర్సీబీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఓవర్​లోని నాల్గవ బంతికి క్రీజులో ఉన్న రాహుల్ తెవాటియా బ్యాటింగ్ చేశాడు. తనకు వచ్చిన బంతిని కోహ్లీ వైపు బాల్ స్ట్రైట్​గా కొట్టాడు. అయితే నాన్​ స్ట్రైకర్ ఎండ్​లో నిలబడి పరుగులు తీసేందుకు ప్రయత్నించిన షారుక్ ఖాన్​, పిచ్ సగ భాగానికి చేరుకున్నాడు.

అయితే అప్పటికే బంతి విరాట్ కోహ్లీ చేతిలోకి వెళ్లింది. ఇక అతడి చేతిలోని బాల్​ను చూసి షారుక్ వెనక్కి పరుగు తీశాడు. కానీ ఈ లోపే కోహ్లీ తన టైమింగ్​తో ఆ బంతిని నేరుగా వికెట్ల వైపుకు విసిరాడు. దీంతో షారూక్ ఖాన్ రనౌటయ్యాడు. ఇక షారుక్ ఔటవ్వగానే కోహ్లీ ప్లయింగ్ కిస్​లు ఇస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియె నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. కోహ్లీ ఔట్ చేసిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఈ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది నాలుగో విజయం. చిన్నస్వామి వేదికగా గుజరాత్ టైటాన్స్​తో తలపడ్డ పోరులో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో నెగ్గింది. గుజరాత్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ (64 పరుగులు, 23 బంతుల్లో; 10x4, 3x6) మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దినేశ్ కార్తిక్ (21*) రాణించాడు.

148 పరుగుల ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (42), ఫాఫ్ డూప్లెసిస్ (64) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డూప్లెసిస్ మాత్రం గుజరాత్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆరో ఓవర్లో సిక్స్​, ఫోర్ బాది తర్వాత బంతికి జోషువా బౌలింగ్​లో క్యాచౌట్​గా వెనుదిరిగాడు. దీంతో 92 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అలాగే పవర్ ప్లే లోనే 92 పరుగుల స్కోర్ నమోదైంది.

విరాట్​ ముంగిట మరో రికార్డ్- ఏకైక ప్లేయర్​గా నిలిచే ఛాన్స్! - IPL 2024

'వరల్డ్​కప్​కు సిరాజ్ వద్దు, పేసర్​గా అతడే బెటర్'- మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.