Vinesh Phogat Retirement : భారతీయ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించి అ అందరినీ షాక్‌కు గురిచేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ ఎమోషనల్ ట్వీట్‌తో రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది.
"అమ్మా కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. క్షమించండి. మీ కల, నా ధైర్యం అంతా విఛిన్నమైంది. ఇంతకుమించి బలం నాకు లేదు. కుస్తీకి వీడ్కోలు 2001-2024. మీ అందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, క్షమించండి" అంటూ వినేశ్ ట్వీట్ చేసింది.
माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024
अलविदा कुश्ती 2001-2024 🙏
आप सबकी हमेशा ऋणी रहूँगी माफी 🙏🙏
CASను ఆశ్రయించిన వినేశ్
మరోవైపు ఆమెను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది వినేశ్. ఆ ఫిర్యాదులో ఆమె సిల్వర్ మెడల్‌కు అర్హురాలంటూ పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై ఆ ఆర్భిట్రేషన్ తీర్పు వెలువడించాల్సి ఉంది. అయితే అంతలోపే వినేశ్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
వాస్తవానికి వినేశ్ ఎప్పుడూ 53 కేజీల విభాగంలో పోటీపడుతుంది. కానీ ఈ ఒలింపిక్స్‌లో అప్పటికే ఆ విభాగంలో మరో భారత రెజ్లర్ అంతిమ్ అర్హత సాధించడం వల్ల వినేశ్ 50 కేజీలకు తగ్గాల్సి వచ్చింది. ఇందుకోసం ఆమె తీవ్రంగా శ్రమించింది. కానీ ఫైనల్స్ సమయానికి ఆమె కొన్ని గ్రాముల బరువు ఉన్నందున ఆమె డిస్క్వాలిఫై అయ్యింది. అయితే ఆ 100 గ్రాములు తగ్గించుకోవడానికి మరికొంత సమయం తనకు ఇవ్వాలంటూ అధికారులను బతిమాలినా కూడా ఆఖరికి ఫలితం లేకుండా పోయింది.
అయితే వినేశ్‌కు ఇది తొలి ఒలింపిక్స్ కాదు. ఇప్పటికే రెండుసార్లు ఆమె ఈ విశ్వక్రీడల్లో పాల్గొంది. గతంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె పెర్ఫామెన్స్ అంత గొప్పగా ఏమీ సాగలేదు. క్వార్టర్స్‌లో ఓటమిపాలై వెనుతిరిగింది. అయితే 2016లో జరిగిన క్వార్టర్ ఫైనల్లో వినేశ్‌కు తీవ్ర గాయమైంది. మోకాలు మెలిక పడి లేవలేని స్థితికి చేరుకుంది. దీంతో కాలికి పెద్ద కట్టుతో ఆమె స్వదేశానికి చేరుకోవాల్సి వచ్చింది. అయితే అప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ గాయం కారణంగా వినేశ్ పతకాన్ని కోల్పోయింది.
డీక్వాలిఫికేషన్ ఎఫెక్ట్ - ఆస్పత్రిలో చేరిన వినేశ్ - Vinesh Phogat Paris Olympics