ETV Bharat / sports

బీసీసీఐపై ఉమేశ్ గుస్సా!- స్టార్ బౌలర్​ ఇన్​స్టా స్టోరీ వైరల్ - ఉమేశ్ యాదవ్ ఆఖరి మ్యాచ్

Umesh Yadav Instagram Story: ఇంగ్లాండ్ సిరీస్​కు ఎంపిక కానందుకు స్టార్ పేసర్ ఉమేశ్ యాదవ్ నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ​ప్రస్తుత సిరీస్​లో మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించిన తర్వాత అతడి ఇన్​స్టా పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.

Umesh Yadav Instagram Story
Umesh Yadav Instagram Story
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 9:47 AM IST

Updated : Feb 11, 2024, 10:02 AM IST

Umesh Yadav Instagram Story: టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ కొన్ని నెలలుగా జట్టుకు దూరమయ్యాడు. అతడు చివరిసారిగా 2023 డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత జరిగిన పలు సిరీస్​ల్లో, టోర్నమెంట్​లో బీసీసీఐ ఉమేశ్​ను ఎంపిక చేయలేదు. అయితే ప్రస్తుతం రంజీ ట్రోఫీలో విదర్భ జట్టుకు ఆడుతున్న ఉమేశ్, టీమ్ఇండియాలో రీ ఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

టీమ్ఇండియాలో స్థానం సంపాదించాలంటే డొమెస్టిక్ టోర్నీల్లో రాణించాల్సిందేనని రీసెంట్​గా సెలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా గుర్తు చేశాడు. ఈ నేపథ్యంలోనే రంజీలో ఆడుతున్న ఉమేశ్ టీమ్ఇండియాలో కమ్​బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు! ఈ టోర్నీలో ఇప్పటికే 18 వికెట్లు పడగొట్టి జట్టులో కీలక బౌలర్​గా మారాడు.

అయితే ఇంగ్లాండ్​తో చివరి మూడు టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించిన తర్వాత ఉమేశ్ ఇన్​స్టాగ్రామ్​లో ఓ స్టోరీ షేర్ చేశాడు. 'కితాబ్ పర్ దూల్ జమ్​నే సే, కహానీ ఖతమ్ నహీ హోతా' (పుస్తకాలపై దుమ్ము చేరినంత మాత్రానా, కథలు ముగిసిపోవు) అని రాసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. అయితే ఇంగ్లాండ్​ సిరీస్​కు ఎంపిక కానుందుకే ఉమేశ్ ఇలాంటి స్టోరీ షేర్ చేసి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. జట్టులో అతడి పేరు లేనందున నిరాశకు గురై, జట్టులో ఎంపిక చేయకున్నా అతడి ఆట ముగిసిపోలేదని ఈ పోస్ట్​తో ఉమేశ్ హింట్ ఇచ్చినట్లున్నాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఉమేశ్ యాదవ్ ఇన్​స్టా స్టోరీ
ఉమేశ్ యాదవ్ ఇన్​స్టా స్టోరీ

ఇక 2023 డబ్ల్యూటీసీ ఫైనల్​లో ఉమేశ్ 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అప్పట్నుంచి సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు! ఆ తర్వాత జరిగిన ఆసియా కప్, వన్డే వరల్డ్​కప్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్, సౌతాఫ్రికా పర్యటన ఇలా దేనికి కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఉమేశ్ 2018లో వెస్టిండీస్​తో ఆఖరి వన్డే మ్యాచ్​ ఆడగా, 2022లో సౌతాఫ్రికాతో లాస్ట్​ టీ20లో కనిపించాడు.

ఫ్రెండ్​ చేతిలో మోసపోయిన క్రికెటర్​​ ఉమేశ్​ యాదవ్​​.. రూ.44 లక్షలు స్వాహా..

IPL 2023 : చరిత్ర సృష్టించిన ఉమేశ్​ యాదవ్​, మార్క్​వుడ్.. సూపర్​ బౌలింగ్​ గురూ!

Last Updated : Feb 11, 2024, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.