ETV Bharat / sports

సూపర్‌-8కు టీమ్​ఇండియా రెడీ - గత రికార్డులు ఎలా ఉన్నాయంటే? - T20 World Cup Super 8

T20 World Cup Super 8 : టీ20 వరల్డ్​ కప్​ 2024లో టీమ్​ఇండియా సూపర్ 8 పోరుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో పొటి ప్రపంచకప్​ సూపర్ 8లో భారత జట్టు ట్రాక్ రికార్డ్​ ఎలా ఉందో తెలుసుకుందాం.

Source ETV Bharat
teamindia (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 17, 2024, 7:23 AM IST

T20 World Cup Super 8 : టీ20 వరల్డ్‌కప్‌ - 2024లో గ్రూపు స్టేజీలో బాగానే రాణించిన టీమ్​ఇండియా ఇక సూపర్‌ - 8 పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో గ్రూప్​ - ఏలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. నాలుగో మ్యాచ్ రద్దైంది. దీంతో సూపర్‌-8లో తోఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్​, ఆస్ట్రేలియాతో టీమ్​ఇండియా పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో గతంలో సూపర్‌-8లో టీమ్ఇండియా రికార్డ్ ఎలా ఉందో పరిశీలిద్దాం.

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) టీ20 ప్రపంచకప్​లో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వచ్చింది. సూపర్ 8, సూపర్ 10, సూపర్ 12 ఫార్మాట్లలో మ్యాచ్‌లను నిర్వహిస్తూ వచ్చింది. అయితే ఈ సారి పొట్టి ప్రపంచకప్​ను సూపర్ 8 రౌండ్‌లో నిర్వహిస్తోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత సూపర్-8 ఫార్మాట్‌ను తిరిగి నిర్వహిస్తున్నారు. చివరిగా 2012 టీ20 ప్రపంచకప్​ను సూపర్‌ 8 ఫార్మాట్‌లో నిర్వహించారు. అయితే ఈ సూపర్‌-8 ఫార్మాట్‌లో టీమ్​ ఇండియా ట్రాక్‌ రికార్డు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. చాలా పేలవంగానే ఉంది.

ఇప్పటి టీ20 ప్రపంచ కప్​ టోర్నీలో సూపర్‌ 8లో 12 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. ఎనిమిది మ్యాచుల్లో ఓటమిని అందుకుంది. విజయ శాతం 33.3 ఉండగా ఓటమి శాతం 66.67గా ఉంది.

2007 టీ20 వరల్డ్‌కప్​లో టీమ్​ఇండియా మూడు మ్యాచ్‌లు ఆడి రెండింట విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లో ఓటమిని అందుకుంది. 2009, 2010 వరల్డ్ కప్​ సూపర్‌-8లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ పరాజయాన్ని అందుకుంది. 2012 ప్రపంచ కప్​లో​ రెండింటిలో గెలుపొంది, ఒక్క మ్యాచ్‌లో ఓడింది. ఈ నాలుగు ప్రపంచకప్​లలోనూ ధోనీ నాయకత్వంలోనే భారత్​ బరిలోకి దిగింది. 2007 ప్రపంచకప్​ను మహీ సారథ్యంలోనే టీమ్​ఇండియా​ అందుకుంది. ఇప్పుడు మళ్లీ 2012 తర్వాత అంటే 12 ఏళ్లు అనంతరం తొలి సారి సూపర్‌-8 ఫార్మాట్‌లో ఆడతోంది.

టీ20 వరల్డ్ కప్ భారత్​ సూపర్ 8 షెడ్యూల్ ఇదే

జూన్ 20 - టీమ్​ఇండియా వర్సెస్‌ అఫ్గానిస్థాన్​, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్

జూన్ 22 - టీమ్​ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్/నెదర్లాండ్స్, ఆంటిగ్వా

జూన్ 24 - టీమ్​ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా, సెయింట్ లూసియా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.