Team India Womens Asia Cup 2024: మహిళల ఆసియా కప్ 2024 టోర్నీకి బీసీసీఐ టీమ్ఇండియా జట్టను ప్రకటించింది. 15మందితో కూడిన స్క్వాడ్‌ను శనివారం బీసీసీఐ వెల్లడించింది. మరో నలుగురు ప్లేయర్లను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేసింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. కాగా, ఈ టోర్నమెంట్ జూలై 19న ప్రారంభమై 28న ముగుస్తుంది. ఈ ఎడిషన్‌కు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది.
గత సీజన్‌లాగే ఈసారి కూడా టీ20 ఫార్మాట్లోనే టోర్నమెంట్ జరగనుంది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా మొత్తం 8జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. టోర్నీలో పాల్గొనే దేశాలు తమతమ జట్లను ఇప్పటికే ప్రకటించాయి. మొత్తం గ్రూప్ దశలో 12మ్యాచ్‌లు ఉండనున్నాయి. జూలై 26న సెమీఫైనల్ 1, సెమీఫైనల్ 2 మ్యాచ్‌లు జరుగుతాయి. రెండు గ్రూప్‌ల్లో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో నెగ్గిన జట్లు 28న జరిగే ఫైనల్‌కు దూసుకెళ్తాయి.
భారత్- పాకిస్ధాన్ మ్యాచ్: ఈ టోర్నీలో తొలిరోజే హై వోల్టేజ్ గేమ్ భారత్- పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్‌కు దంబుల్లా మైదానం వేదిక కానుంది. జూలై 19 రాత్రి 7.00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గతంలో టీమ్ఇండియా 6సార్లు పాకిస్థాన్‌తో తలపడగా అన్నింట్లోనూ విజయం సాధించింది. ఇక ఓవరాల్‌గా ఈ ఇరుజట్లు 14టీ20 మ్యాచ్‌ల్లో పోటీపడగా భారత్ 11సార్లు, పాకిస్థాన్ 3 మ్యాచ్‌ల్లో నెగ్గింది.
భారత్ మ్యాచ్‌లు
జులై 19 | భారత్- పాకిస్థాన్ |
జులై 21 | భారత్- యూఏఈ |
జులై 23 | భారత్- నేపాల్ |
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, యాదవ్ , శ్రేయాంక పాటిల్, సజన సజీవన్.
ట్రావెలింగ్ రిజర్వ్: శ్వేతా సెహ్రావత్, సైకా ఇష్కే, తనూజా కన్వర్, మేఘనా సింగ్.
A look at the @ImHarmanpreet-led squad for #WomensAsiaCup2024 in Sri Lanka 👌👌#TeamIndia | #ACC pic.twitter.com/g77PSc45XA
— BCCI Women (@BCCIWomen) July 6, 2024
2024 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్- భారత్ x పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? - Asia Cup 2024 Schedule
అండర్-19 ఆసియా కప్ 2023 జట్టును ప్రకటించిన బీసీసీఐ- HCA నుంచి ఇద్దరు