Team India T20 World Cup: 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఫైట్ భారత్- సౌతాఫ్రికా మధ్య జరగనుంది. బర్బాడోస్ వేదికగా జూన్ 29న ఈ ఫైనల్ జరగనుంది. టైటిల్‌కు ఒక్క అడుగు ఉన్న ఇరుజట్లు కూడా ఛాంపియన్‌గా నిలవాలని ఆశిస్తున్నాయి. అయితే 2013 నుంచి టీమ్ఇండియా ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తోంది. చివరిసారిగా ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టీమ్ఇండియా 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ దక్కించుకుంది. అప్పటి నుంచి ఐసీసీ కప్పు కోసం భారత్ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ 11ఏళ్ల కాలంలో పలు సందర్భాల్లో ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్ చేరినప్పటికీ తృటిలో కప్పు చేజార్చుకుంది.
- 2014 టీ20 వరల్డ్‌కప్: బంగ్లాదేశ్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2014లో టీమ్‌ఇండియా ఫైనల్ చేరింది. శ్రీలంకతో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
- 2015 వన్డే ప్రపంచకప్: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2015లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన భారత్ సెమీ ఫైనల్లో ఓడిపోయింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో 95 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
- 2016 టీ20 ప్రపంచకప్: స్వదేశంలో జరిగిన ఈ టీ20 ప్రపంచకప్‌లో కూడా టీమ్‌ఇండియాకి నిరాశే ఎదురైంది. ముంబయి వాంఖడేలో వెస్టిండీస్‌తో జరిగిన సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
- 2017 ఛాంపియన్స్ ట్రోఫీ: ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ఓవల్ వేదికగాలో పాకిస్థాన్‌తో జరిగిన టైటిల్ పోరులో భారత్ 180 పరుగుల తేడాతో ఓడిపోయింది.
- 2019 వన్డే ప్రపంచ కప్: ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 వన్డే వరల్డ్‌కప్‌లో టీమ్‌ఇండియా సెమీస్ చేరింది. కానీ, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది.
- 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్: 2021లో భారత్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
- 2022 టీ20 ప్రపంచకప్: 2022 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, అడిలైడ్‌లో జరిగిన సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ, సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టిన భారత్ 10 వికెట్ల తేడాతో ఓడి ఇంటిబాట పట్టింది.
- 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడింది. ఓవల్‌లో జరిగిన టైటిల్ పోరులో 209 పరుగుల ఇండియా ఓడిపోయింది.
- 2023 వన్డే ప్రపంచకప్: 2023లో అజేయంగా ఫైనల్ చేరిన భారత్, వరల్డ్‌కప్ టైటిల్‌కి ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఓడి మరోసారి భంగపడింది. ఈ ఓటమితో ఫ్యాన్స్‌తోపాటు ప్లేయర్లు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు.
7️⃣ checkmates on the road to glory, 1️⃣ more to go ⏳
— T20 World Cup (@T20WorldCup) June 28, 2024
Rohit Sharma leads an unbeaten India into the #T20WorldCup Final 🤩 pic.twitter.com/GbOWliYX3K— BCCI (@BCCI) June 27, 2024
వాళ్ల గురించి రోహిత్ అప్పుడే చెప్పాడు- ప్రొఫెషనల్ కెప్టెన్ అనిపించుకున్నాడుగా!
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ - తొలి కెప్టెన్‌గా సూపర్ రికార్డ్! - T20 Worldcup 2024 Rohith Sharma