India vs Bangladesh Test Series 2024 : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. తొలి టెస్టులో విజయం సాధించిన జట్టుతోనే రెండో టెస్టుకు కూడా సిద్ధం అవుతోంది. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తారని తొలుత భావించినా, అలాంటిదేమీ జరగలేదు. కాన్పూర్ వేదికదా సెప్టెంబర్ 27న రెండో టెస్టు ప్రారంభం కానుంది. మరోవైపు బంగ్లాదేశ్ ఈ సిరీస్ కోసం రెండు టెస్టులకు ఒకే జట్టును ముందే ప్రకటించింది.
కాగా, బంగ్లాదేశ్ సిరీస్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తొలి టెస్టులో నాలుగు రోజుల్లోనే విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ సాధించగా, రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ శతకాలు బాదారు. మరోవైపు బంతితోనూ అద్భుతాలు చేసిన టీమ్ఇండియా బౌలర్లు బంగ్లా బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో బంగ్లా ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఇక బౌలింగ్‌లోనూ సత్తా చాటిన అశ్విన్‌కు 'మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) September 22, 2024
India retain same squad for 2nd Test against Bangladesh.
More Details 🔽 #TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBankhttps://t.co/2bLf4v0DRu
స్కోర్లు
- భారత్ : 376 & 287/4 d
- బంగ్లాదేశ్ : 149 & 234
భారత్ జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్
బంగ్లాదేశ్ జట్టు
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రానా, హసన్ మహ్మద్, తాస్ సయ్యద్ ఖలీద్ అహ్మద్, జాకర్ అలీ అనిక్
అశ్విన్@6- తొలి టెస్ట్‌లో బంగ్లాపై భారత్ ఘన విజయం - India Vs Bangladesh 1st Test