ETV Bharat / sports

రిలాక్స్​ మోడ్​లో టీమ్ఇండియా- వాలీబాల్​తో చిల్ అవుతున్న ప్లేయర్లు- వీడియో చూశారా? - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

Team India Players Volleyball: టీమ్ఇండియా ప్లేయర్లంతా టీ20 వరల్డ్​కప్​ టోర్నీలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో విండీస్​ చేరుకున్న భారత జట్టు, సోమవారం బర్బాడోస్​ బీచ్​లో వాలీబాడ్ గేమ్ ఆడారు. ఈ వీడియో మీరు చూశారా?

Team India Volleyball
Team India Volleyball (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 17, 2024, 3:57 PM IST

Updated : Jun 17, 2024, 4:03 PM IST

Team India Players Volleyball: 2024 టీ20 వరల్డ్​కప్​ టోర్నీలో బిజీగా ఉన్న టీమ్ఇండియా ప్లేయర్లు సరదాగా వాలీబాల్ గేమ్ ఆడారు. సూపర్- 8 మ్యాచ్​ల కోసం ఇప్పటికే వెస్టిండీస్ చేరుకున్న టీమ్ఇండియా ప్లేయర్లు, సోమవారం బర్బడోస్ బీచ్​లో వాలీబాల్ ఆడుతూ కాస్త చిల్ అయ్యారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య ఫ్యాన్స్​ను ఆకర్షించారు. హుషారుగా ఆడుతూ గేమ్​ను బాగా ఎంజాయ్ చేశారు..

ప్లేయర్లంతా రెండు జట్లుగా విడిపోయి సరదాగా మ్యాచ్ ఆడారు. వీరితోపాటు టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్​ కూడా వాలీబాల్ గేమ్​లో పాల్గొన్నాడు. ఇక ప్లేయర్లలో కొంతమంది చొక్కా లేకుండా ఆడుతూ కనిపించారు. ఈ క్రమంలో విరాట్ చాలా ఫిట్​గా కనిపించడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. యంగ్ బ్యాటర్లు రింకూ సింగ్, యశస్వీ జైశ్వాల్ జట్టులో అద్భుతంగా ఆడతారని పేసర్ ఖలీల్ అహ్మద్ చెప్పాడు. ఈ వీడియోను బీసీసీఐ అఫీషియల్ ట్విట్టర్​ అకౌంట్​లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

గ్రూప్ స్టేజ్​లో ఆడిన 3 విజయాలతో ఇప్పటికే సూపర్- 8కి దూసుకెళ్లిన భారత్, కీలక మ్యాచ్​లకు సన్నద్ధమవుతోంది. గ్రూప్ A నుంచి భారత్​తోపాటు ఆతిథ్య దేశం అమెరికా కూడా సూపర్- 8కు అర్హత సాధించింది. ఇక సూపర్ -8లో టీమ్ఇండియా మూడు మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. ఇందులో తొలి మ్యాచ్​లో భారత్ జూన్​ 20న అఫ్గానిస్థాన్​తో తలపడనుంది.

భారత్ సూపర్-8 మ్యాచ్​లు

  • జూన్ 20- భారత్ x అప్గానిస్థాన్ (బర్బాడోస్)
  • జూన్ 22- భారత్ x బంగ్లాదేశ్ (అంటిగ్వా)
  • జూన్ 24- భారత్ x ఆస్ట్రేలియా (లూసియా)

అయితే సూపర్- 8 మ్యాచ్​లన్నింటికీ వర్షం అంతరాయం కలిగించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 20న జరిగే భారత్- అఫ్గానిస్థాన్​ మ్యాచ్ మినహా మిలిగిన గేమ్​లన్నింటికీ వర్షం ముప్పు పొంచి ఉందని విండీస్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే లీగ్ స్టేజ్​లో పలు మ్యాచ్​లు వర్షం కారణంగానే రద్దయ్యాయి. ఇక సూపర్- 8లోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. కానీ, అది ఆయా జట్ల అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది..

సూపర్-8కు చేరుకున్న జట్లు ఇవే- టీమ్ఇండియా ఎవరితో తలపడనుందటే? - T20 world cup 2024

నేపాల్‌పై ఘనవిజయం- సూపర్‌కు 8కు దూసుకెళ్లిన బంగ్లాదేశ్‌ - T20 worldcup 2024

Last Updated : Jun 17, 2024, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.