Pujara Rahanes Replacement Tests: టీమ్ఇండియా రానున్న నెలల్లో టెస్టు మ్యాచ్‌లు ఎక్కువగా ఆడనుంది. అందులో ప్రతిష్ఠాత్మకమైన బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఒకటి. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ కూడా సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అందుకు తగ్గట్లుగానే యంగ్ ప్లేయర్లను రంజీ, దులీప్ ట్రోఫీలాంటి డొమెస్టిక్ టోర్నీల్లో ఆడేలా ప్రోత్సహిస్తుంది. అయితే ప్రస్తుత టీమ్ఇండియా టెస్టు జట్టులో మిడిలార్డర్ కాస్త సమస్యగా మారింది. ఇదివరకు వన్ డౌన్, మిడిలార్డర్ స్థానాల్లో ఛెతేశ్వర్ పుజారా, అంజిక్యా రహానే సమర్థంగా రాణించారు.
అయితే ఫామ్, ఇతర కారణాల వల్ల వీరిద్దరూ జట్టుకు దూరమయ్యాక ఆ స్థానాలు ఎవరు భర్తీ చేస్తారన్న విషయంలో సందిగ్ధం నెలకొంది. ఇలాంటి సందర్భంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు దినేశ్ కార్తిక్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. యువ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ టెస్టుల్లో పుజారా, రహానే స్థానాలను భర్తీ చేయడంలో విజయవంతం అవుతారని పేర్కొన్నాడు. ఈ ఇద్దర
'ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో శుభ్‌మాన్, సర్ఫరాజ్ ఇద్దరూ అద్భుతంగా రాణించారు. నవంబర్‌లో ప్రారంభం కానున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి ఈ ఇద్దరు యువ బ్యాటర్లు ఎంపిక అవుతారన్న నమ్మకం ఉంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై కూడా వీళ్లు రాణిస్తారనుకుంటున్నా. రహానే, పుజారా స్థానాలు భర్తీ చేయగలరా అని ఈ సిరీస్‌తో మనకు కూడా తెలుస్తుంది. కానీ, వాళ్లకు ఆ క్యాలీబర్ ఉందని నేను నమ్ముతున్నా' అని దినేశ్ కార్తిక్ రీసెంట్‌లో ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో అన్నాడు.
2020లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన గిల్ సొంతగడ్డపైనే కాకుండా విదేశాల్లోనూ రాణించాడు. ఇప్పటివరకు 25 టెస్టుల్లో 1492 పరుగులతో ఆకట్టుకున్నాడు. అందులో 4 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇందులో చాలా టెస్టుల్లో గిల్ ఓపెనింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగాడు. మరోవైపు సర్ఫరాజ్ డొమెస్టిక్ టోర్నీల్లో నిలకడగా రాణించాడు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా, తనదైన స్ట్రైల్లో బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడు. ఆడింది 3 మ్యాచ్‌లే అయినా 3 హాఫ్ సెంచరీలతో 200 పరుగులు చేశాడు.
'గిల్ వల్లే సెంచరీ మిస్' - యశస్వి జైస్వాల్ ఏమన్నాడంటే? - Ind vs Zim T20 2024