Rohit Sharma 4 spinners: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2024కి బీసీసీఐ టీమ్ఇండియా రీసెంట్గా స్క్వాడ్ అనౌన్స్ చేసింది. ఇందులో ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్‌లు, ఇద్దరు స్పిన్నర్‌లకు అవకాశం ఇచ్చింది. అయితే యూఎస్, వెస్టిండీస్‌లో జరుగుతున్న వరల్డ్‌కప్‌కి నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఫుల్ క్లారిటీతో ఉందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేయడంలో ఐపీఎల్ పెర్ఫార్మెన్స్‌లను పెద్దగా పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నాడు
ముగ్గురు పేసర్లతో పాటు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, స్పిన్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ 15 మంది స్క్వాడ్‌లో ఉన్నారు. జట్టు ఎంపికపై ఉన్న సందేహాలకు రోహిత్ ముంబయిలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరణ ఇచ్చాడు.
నలుగురు స్పిన్నర్లు అవసరమే
రోహిత్ 4 స్పిన్నర్ల ఎంపికపై స్పందించాడు. 'దీనిపై వివరాల్లోకి వెళ్లనక్కర్లేదు. నాకు కచ్చితంగా నలుగురు స్పిన్నర్లు కావాలి. మేం అక్కడ చాలా క్రికెట్ ఆడాం. ఉదయం 10 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. నలుగురు స్పిన్నర్లను ఎంచుకోవడానికి గల కారణాన్ని నేను ఇప్పుడు వెల్లడించను. నేను ఖచ్చితంగా మా స్పిన్నర్లను కోరుకున్నాను. రెండు ఆల్‌రౌండర్, రెండు అటాకింగ్ ఆప్షన్‌లు ఉన్నాయి. వీటితో టీమ్‌కి బ్యాలెన్స్ వస్తుంది. ఆపోజిట్ టీమ్‌ని బట్టి నలుగురిలో ఎవరిని ఆడించాలో నిర్ణయిస్తాం. దీనిపై తొలి మ్యాచ్ తర్వాత వెస్టిండీస్‌లోనే మీకు క్లారిటీ ఇస్తా' అని రోహిత్ అన్నాడు.
దూబే ఎందుకంటే?
వరల్డ్‌కప్ జట్టు ఎంపిక సందర్భంగా కీలకమైన మిడిల్ ఓవర్లలో భారత్ అవసరాలకు అనుగుణంగా ఆడే ప్లేయర్‌ని ఎంపిక చేయడానికి చాలా శ్రద్ధ తీసుకున్నట్లు రోహిత్ వివరించాడు. రింకూ సింగ్‌ను కాదని శివమ్ దూబేని ఎంపిక చేయడంపై మాట్లాడాడు. దూబే ఎంపిక మిడిల్-ఆర్డర్ బ్యాటింగ్‌ను బలోపేతం చేయడంతో పాటు అదనపు బౌలింగ్ ఆప్షన్‌ని అందిస్తుందని తెలిపాడు.
టీమ్‌ఇండియా జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
విరాట్‌పై ఆందోళనా? కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై రోహిత్, అగార్కర్ రియాక్షన్ ఇదే! - T20 World Cup 2024
'రాహుల్, రింకూను అందుకే పక్కన పెట్టాం- కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తప్పవు' - T20 World Cup 2024