T20 Worldcup 2024 Super 8 : టీ20 ప్రపంచకప్ 2024 ఎనిమిది జట్లతో సూపర్ - 8 సమరం ప్రారంభం కానుంది. టీమ్ ఇండియా గురువారం(జూన్ 20) నుంచి తమ మ్యాచ్‌లను ప్రారంభించనుంది. గ్రూప్ - 1లో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో పోటీ పడనుంది. ఇందులో రెండు జట్లను తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే అవి ఇప్పటికే పెద్ద జట్లకు షాక్‌లు ఇచ్చాయి.
తక్కువ అంచనా వేయలేం - లీగ్ స్టేజ్‌లో ఏకంగా న్యూజిలాండ్‌పై 84 పరుగుల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది అఫ్గానిస్థాన్. గ్రూప్-Cలో విండీస్, కివీస్ వంటి బలమైన టీమ్స్‌తో పాటు కొత్తగా వచ్చిన ఉగాండా, పాపువా న్యూగినీతో పోటీ పడింది అఫ్గాన్ జట్టు. అంచనాలు తారుమారు చేసి కివీస్‌కు షాక్ ఇచ్చిన అఫ్గాన్ మిగతా జట్లపైన గెలుపొంది సూపర్-8కి అర్హత సాధించింది. వెస్టిండీస్ చేతిలో మాత్రమే ఓడిపోయింది.
అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌తో పాటు గుర్బాజ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇబ్రహీం జద్రాన్, నబీ, గుల్బాదిన్ నైబ్, ఫరూఖి, నూర్ అహ్మద్, నవీనుల్ హక్ డేంజరస్ ప్లేయర్స్. మ్యాచ్‌ను తమవైపు తిప్పుకోగల సామర్థ్యం ఉన్నవారు. ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు అత్యధిక రన్స్ సాధించిన బ్యాటర్ల జాబితాలో 167 పరుగులతో గుర్బాజ్ ముందున్నాడు. బౌలర్లలో ఫరూఖి (12) టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఇలాంటి బలమైన టీమ్‌తో జూన్ 20న బార్బడోస్ వేదికగా టీమ్ఇండియా తొలి మ్యాచ్‌లో పోటీపడనుంది.
బంగ్లాతో కూడా జాగ్రత్తగా! - గ్రూప్-D నుంచి రెండో స్థానంలో నిలిచింది బంగ్లాదేశ్. కేవలం సౌతాఫ్రికా చేతిలోనే ఓటంది. లంక, నెదర్లాండ్స్, నేపాల్ జట్లను ఓడించి సూపర్-8కు అర్హత సాధించింది. మాజీ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి షకిబ్‌తో పాటు కెప్టెన్ షాంటో, మహ్మదుల్లా, తన్జిద్ను అడ్డుకుంటే దాదాపు సగం గెలిచినట్లే. బౌలింగ్‌లోనూ ముస్తాఫిజర్ కీలకంగా ఉన్నాడు. అతడికి భారత బ్యాటర్ల ఆటతీరుపై ఓ అవగాహన ఉంది. రిషద్, తస్కిన్ కూడా డేంజరే. ఇలాంటి బంగ్లాదేశ్ జట్టుతో టీమ్ఇండియా జూన్ 22న ఆంటిగ్వా వేదికగా తలపడనుంది.
ఆస్ట్రేలియాతో సవాల్! - గ్రూప్ - Bలో నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన ఆస్ట్రేలియా లీగ్ స్టేజ్‌లో బలమైన ఇంగ్లాండ్‌తో పాటు నమీబియా, ఒమన్, స్కాట్లాండ్‌ను ఓడించింది. ఓపెనర్లు వార్నర్, ట్రావిస్ హెడ్, మార్కస్ స్టాయినిస్ చెలరేగుతున్నారు. బౌలింగ్‌లో స్టార్క్, ఆడమ్ జంపా ప్రత్యర్థులను ఆటాడేసుకుంటున్నారు. ఆసీస్‌తో భారత్ జూన్ 24న సెయింట్ లూసియా వేదికగా పోటీపడనుంది.
సూపర్ - 8లో భారత్ అఫ్గాన్, బంగ్లా, ఆసీస్‌పై గెలిస్తే సెమీస్ చేరేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే నెట్‌రన్‌రేట్ కీలకం అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
నికోలస్ పూరన్ విధ్వంసం - ఒకే ఓవర్లో 36 పరుగులు - T20 Worldcup 2024
T20 ప్రపంచకప్ 2026కు అర్హత సాధించిన 12 జట్లు ఇవే - T20 WorldCup 2026