T20 Worldcup 2024 Kamran Akmal Harbhajan Singh : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్‌కు దిగొచ్చాడు. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ, సిక్కు కమ్యూనిటీని అవమానించేలా కామెంట్స్ చేశాడు అక్మల్. వాటిపై సోషల్ మీడియా వేదికగా దుమారం చెలరేగడంతో పలువురు ప్రముఖులు స్పందించారు. ఈ కాంట్రవర్సీలో భజ్జీ ఇన్వాల్వ్ అయి కౌంటర్ ఇవ్వడంతో అక్మల్ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు.
న్యూయార్క్ వేదికగా జూన్ 9న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. హైఓల్టేజ్ మ్యాచ్‌లో విజయం ఎవరికి దక్కుతుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో కమ్రాన్ అక్మల్ ఏఆర్వై న్యూస్ ఛానెల్‌లో జరిగిన ప్యానెల్ డిస్కషన్‌లో పాల్గొన్నాడు. సరిగ్గా చివరి ఓవర్‌ను టీమ్ఇండియా స్పిన్నర్ అర్షదీప్ సింగ్ బౌలింగ్ వేస్తున్న సమయంలో సిక్కుల కమ్యూనిటీ అవమానించేలా, తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. "ఏదైనా జరగొచ్చు. టైం ఆల్రెడీ 12 అయింది" అంటూ మరిన్ని కామెంట్స్ చేశాడు.
ఒక మతాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అవి కాస్త హర్భజన్‌కు చేరడంతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. "సిక్కుల గురించి మాట్లాడాలని నీ చెత్త నోరు తెరిచే ముందు ఒకసారి సిక్కుల చరిత్ర తెలుసుకో. ఆక్రమణదారుల దాడిలో చిక్కుకుపోయిన మీ తల్లులను, చెల్లెళ్లని కాపాడిన చరిత్ర సిక్కులది. అప్పుడు కూడా టైం 12 అవ్వొస్తుంది. నీకు కొంచెం కూడా అభిమానం లేకపోవడం సిగ్గు చేటు" అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.
దీంతో యావత్ సిక్కుల కమ్యూనిటీనే అవమానించేలా చేసిన కామెంట్లపై అక్మల్ రియలైజ్ అయ్యాడు. "నేను హర్భజన్ సింగ్, సిక్కుల కమ్యూనిటీలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నాను. నా మాటలు అవమానించేలా, తప్పుగా ఉన్నాయని తెలుసుకున్నాను. నాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులపై చాలా అమితమైన గౌరవముంది. ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో అలా అనలేదు. అందరినీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను." అంటూ రిప్లై ఇచ్చాడు కమ్రాన్ అక్మల్.
కాగా, స్పోర్ట్స్ కామెంటరీ చేసేటప్పుడు ప్రేక్షకుల భావోద్వేగాలతో పాటు ఉద్దేశ్యపూర్వకంగా మతాలను, సంప్రదాయాలను అవమానించేలా మాట్లాడకూడదని తెలియాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే న్యూయార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యానికి ఏడు పరుగుల దూరంలోనే నిలిచి ఓటమికి గురైంది పాకిస్థాన్.
సౌతాఫ్రికా బతికిపోయింది - ఉత్కంఠ పోరులో బంగ్లాపై విజయం - T20 Worldcup 2024
భారత్‌కు హోమ్ గ్రౌండ్‌గా లాహోర్ - గట్టి బందోబస్తుతో! - Champions Trophy 2025