T20 WorldCup 2024 Aqib Ilyas cancer : ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడితే తిరిగి కోలుకోవడం అంత సులువు కాదు. ఒకవేళ ప్రాణాలతో బయటపడినా తిరిగి మునుపటి స్థితికి చేరడం ఎంతో కష్టం. ఎన్నో ఛాలెంజెస్ను ఎదుర్కోవాలి. క్రికెటర్లలో టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్‌ను అధిగమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో క్రికెటర్ కూడా క్యాన్సర్‌ను జయించి ఆటలో తిరిగి అడుగుపెట్టాడు. అతడే ఒమన్ కెప్టెన్ అకీబ్ ఇలియాజ్. 31ఏళ్ల వయస్సున్న ఇతడు చీలమండ క్యాన్సర్‌ను జయించి ఇప్పుడు ఆటలో కొనసాగుతున్నాడు. ఇతడు టాప్‌ఆర్డర్ బ్యాటర్, లెగ్ స్పిన్నర్ కూడా.
మెసేజ్ పంపి ఫోన్ స్విచ్ఛాఫ్ - అకీబ్ ఫ్యామిలీ పాకిస్థాన్ సియాల్ కోట్‌లో నివాసం ఉంటోంది. అతడి తండ్రికీ కూడా ఆరోగ్యం బాగుండేది కాదు. అయితే ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం అతడి కాలికి ఓ వాపు వచ్చింది. ఆ తర్వాత చికిత్సలో అది క్యాన్సర్ అని తేలింది. దీంతో ఆందోళన చెందిన అతడు తన క్రికెట్ కెరీర్ ముగిసిపోయిందని ఒమన్ జట్టు కోచ్‌కు మెసేజ్ పంపి, ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. తనకొచ్చిన క్యాన్సర్ గురించి ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా చెప్పలేదు.
ఆయన అండతో చికిత్స - అనంతరం సోదరుడు బలవంతం చేయడంతో ఇంట్లో అసలు విషయాన్ని చెప్పాడు. ఇక భవిష్యత్ ఎలా ఉంటుంది? మళ్లీ క్రికెట్ ఆడగలనా? లేదా అనే ఆలోచనలతో సతమతమయ్యేవాడు. అసలు తన కాలు ఉంటుందా, బతుకుతానా లేదా అన్న భయంతో జీవనం కొనసాగించేవాడు. అయితే అకీబ్‌కు ఒమన్ క్రికెట్ ఛైర్మన్ పంకజ్ భరోసా ఇచ్చి అండగా నిలిచారు. ఎంత డబ్బు ఖర్చు అయినా భరిస్తానన్నాడు. లండన్‌కు పంపేందుకు సిద్ధమయ్యారు. అయితే పాకిస్థాన్‌కే నిపుణులైన వైద్యులను పిలిపించి చికిత్స అందించారు. శస్త్రచికిత్స చేయించగా అది విజయవంతమైంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో కోలుకునేందుకు 18 నెలల సమయం పట్టింది. ఇక కోలుకున్న అకీబ్ పునరాగమనంలో అదరగొట్టాడు. వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో ఐర్లాండ్‌పై, యూఏఈ జట్లపై హాఫ్ సెంచరీలు బాదాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ 2024లో ఒమన్ జట్టుకు కెప్టెన్‌గా సెలెక్ట్ అయ్యాడు.
నొప్పి పెడుతున్నా ఆడుతూ - అకీబ్ రెండో అన్నయ్య అద్నాన్ కూడా క్రికెటరే. అతడు ఒమన్ తరపున 12 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే అకీబ్‌కు ఆరు నెలల వయసున్నపుడే ఒమన్‌కు వెళ్లిపోయాడు. దీంతో అద్నాన్‌ను స్ఫూర్తిగా తీసుకుని అకీబ్. అండర్-19లో ఒమన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఉన్నత చదువుల కోసం దుబాయ్ కూడా వెళ్లాడు. అక్కడ కూడా క్రికెట్ ఆడేవాడు. అలా యూఏఈకి ఆడే ఛాన్స్ వచ్చింది. కానీ ఒమన్‌కే ఆడాలని భావించి తిరిగొచ్చాడు. అయితే తనకు ఇప్పటికీ కాలు నొప్పి పెడుతోందని చెబుతున్నాడు అకీబ్. తీవ్ర సాధనకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారట. కానీ అతడు మాత్రం నొప్పి ఉన్నప్పటికీ దేశం కోసం ఆడుతూనే ఉంటానని చెబుతున్నాడు.
కాగా, ఒకప్పుడు ఒమన్‌లో క్రికెట్ వసతి, సౌకర్యాలు పెద్దగా లేవు. క్రికెటర్లు వేరే పని చేసుకుంటూ కడుపు నింపుకోవాల్సి వచ్చేది. అప్పుడు పంకజ్ ఛైర్మన్‌గా, దులీప్ కోచ్‌గా ఎంపికయ్యాక పరిస్థితి మారింది.
పసికూనపై అతి కష్టంగా - పాపువా న్యూగినీపై విండీస్ విజయం - T20 World Cup 2024
మా ఫైట్ ఎప్పుడూ చర్చనీయమే- కానీ, ఈసారి అలా కాదు: బాబర్ - T20 World Cup 2024