T20 Worldcup 2024 Bangladesh vs Netherlands : ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు కీలక విజయం దక్కింది. గ్రూప్-డి మ్యాచ్‌లో భాగంగా ఆ జట్టు నెదర్లాండ్స్‌పై 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడిన బంగ్లాదేశ్ రెండు విజయాలతో సూపర్-8 అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులే చేసింది. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విక్రమ్‌జిత్ సింగ్ (26), స్కాట్ ఎడ్‌వర్డ్స్ (25) ఫర్వాలేదనిపించారు. వాస్తవానికి ఓ దశలో 14.3 ఓవర్లలో 111/3తో గట్టిగానే పోటీలో నిలిచింది. కానీ సిబ్రాండ్‌ను రిషాద్ (3/33) ఔట్ చేయడం వల్ల ఇన్నింగ్స్ స్వరూపం మారిపోయింది. బంగ్లా చకచకా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌పై పట్టుబిగించింది. దీంతో నెదర్లాండ్స్‌కు పుంజుకునే అవకాశం రాలేదు. బంగ్లా బౌలర్లలో రషీద్ హొస్సెన్ 3 వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్ 2, ముస్తాఫిజుర్, తంజిమ్ హసన్, మహ్మదుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. షకీబ్(46 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 64* పరుగులు) ఆట హైలౌట్గా నిలిచింది. తమ జట్టు పోటీ ఇవ్వదగ్గ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలకంగా వ్యవహరించాడు. ఓ దశలో 23 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది బంగ్లా. ఆ దశలో తంజిద్‌కు తోడైన షకీబ్ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. తాంజిద్ హసన్ (26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 35 పరుగులు), మహ్మదుల్లా (21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 25 పరుగులు) ఫర్వాలేదనిపించారు. లిట్టన్ దాస్ (1), నజ్ముల్ హొస్సెన్ శాంటో (1), హృదయ్ తౌహిద్ (9) నిరాశపరిచారు. జాకేర్ అలీ( 7 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14;) నాటౌట్‌గా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మీకెరన్, ఆర్యన్ దత్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. టిమ్ ప్రింగిల్‌కు ఒక్క వికెట్ తీశాడు.
రూ.1.3 లక్షల కోట్లకు పెరిగిన ఐపీఎల్ వ్యాల్యూ - టాప్‌లో సీఎస్కే, ముంబయి డౌన్ - IPL Teams Brand value
ఫ్లోరిడాలో భారీ వర్షాలు - పాకిస్థాన్ 'సూపర్ 8' ఆశలు ఆవిరి! - T20 world cup elimination