T20 World Cup Youngsters: 2024 టీ20 వరల్డ్‌కప్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన 8 ఎడిషన్లలో అనేక మంది ఆటగాళ్లు ప్రపంచానికి పరిచయం అయ్యారు. ముఖ్యంగా ప్రతి ఎడిషన్‌లో ఆయా జట్లనుంచి పలువురు యంగ్ ప్లేయర్లు వెలుగులోకి వస్తుంటారు. ఇప్పటి స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్, కర్లోస్ బ్రాత్‌వైట్ తదితరులు అలా పొట్టికప్ టోర్నీలో రాణించి స్టార్లుగా ఎదిగినవారే. ఈ నేపథ్యంలో ఈసారి కూడా పలువురు ఆటగాళ్లపై స్పెషల్ ఫోకస్ ఉండనుంది. మరి వారెవరో తెలుసా?
యశస్వీ జైస్వాల్: 21ఎళ్ల టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ కెరీర్లో తొలి టీ20 ప్రపంచకప్ ఆడనున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేసే అవకాశం దాదాపు జైశ్వాల్‌కే దక్కుతుంది. గతేడాది ఐపీఎల్లో రాణించిన జైశ్వాల్‌కు టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేసే ఛాన్స్ వచ్చింది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 16 ఇన్నింగ్స్‌లో 502 పరుగులు చేశాడు. కాగా, 2024 ఐపీఎల్‌లోనూ 435 పరుగులతో అదరగొట్టిన జైశ్వాల్, ప్రపంచకప్‌లో రాణిస్తే భారత్‌కు మంచి ఆరంభాలు దక్కుతాయి.
ట్రిస్టన్ స్టబ్స్: సౌతాఫ్రికా యంగ్ ప్లేయర్ స్టబ్స్ అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. అయతే రీసెంట్గా ముగిసిన ఐపీఎల్లో మాత్రం స్టబ్స్ దిల్లీ క్యాపిటల్స్‌కు మిడిలార్డర్లో బలంగా నిలిచాడు. 13 ఇన్నింగ్స్‌లో 378 పరుగులతో సత్తా చాటాడు. దీంతో సౌతాఫ్రికా ఈ కుర్రాడిని పొట్టికప్పు జట్టుకు ఎంపికచేసింది. ఇక ఐపీఎల్ ఫామ్ కొనసాగిస్తే, సఫారీలకు ఛేజింగ్‌లో కీలక ప్లేయర్‌గా మారే అవకాశం ఉంది.
కామెరూన్ గ్రీన్: ఆస్ట్రేలియా కుర్రాడు గ్రీన్ ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20లో పెద్దగా రాణించలేదు. కానీ, 2024 ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఆడిన గ్రీన్ 255 పరుగులుతో ఫర్వాలేదనిపించాడు. దూకుడైన బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్ చేయగల నైపుణ్యాలు ఉండడం గ్రీన్‌కు కలిసొచ్చే అంశం. ఈ కారణంగానే గ్రీన్ ఆసీస్ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. ఒకవేళ తుదిజట్టులో స్థానం దక్కితే పవర్ ప్లేలో గ్రీన్ ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. అటు బౌలింగ్‌లోనూ రాణించగలడు.
విల్ జాక్స్: 25ఏళ్ల ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే విధ్వంసం సృష్టించగలడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో గుజరాత్‌తో మ్యాచ్‌లో సాధించిన సెంచరీయే అందుకు ఉదాహరణ. ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన జాక్స్ ఈ మ్యాచ్‌లో 50 నుంచి 100 పరుగుల మార్క్ అందుకోవడానికి కేవలం 10 బంతులు తీసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా జాక్స్ వెలుగులోకి వచ్చాడు. ఈ పొట్టికప్‌లోనూ ఇంగ్లాండ్ ఈ యంగ్ ఆల్‌రౌండర్‌పై ఆశలు పెట్టుకుంది.
2007- 2022 వరల్డ్‌కప్ రికార్డులు- అన్నింట్లోనూ భారత్‌దే డామినేషన్! - T20 World Cup 2024
రోహిత్, కోహ్లీకి ఇదే లాస్ట్- 11ఏళ్ల నిరీక్షణకు తెర దించుతారా? - T20 World Cup 2024