ETV Bharat / sports

టీమ్ఇండియాకు బిగ్​ ప్రైజ్​మనీ- టోర్నీలో హైలైట్స్ ఇవే! - T20 World Cup 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 9:03 AM IST

T20 World Cup Prize Money 2024: భారత్ 2024 విశ్వవిజేతగా నిలిచింది. బర్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్​లో సౌతాఫ్రికాపై టీమ్ఇండియా నెగ్గింది. దీంతో భారత్​కు భారీ మొత్తంలో ప్రైజ్​మనీ దక్కింది.

T20 World Cup Prize Money 2024
T20 World Cup Prize Money 2024 (Source: Associated Press)

T20 World Cup Prize Money 2024: భారత్ టీ20 వరల్డ్​కప్​ విజేతగా నిలిచింది. 2024 పొట్టికప్ టోర్నీలో అజేయంగా ఫైనల్​కు దూసుకెళ్లిన టీమ్ఇండియా తుదిపోరులోనూ అదే జోరు కొనసాగిస్తూ సౌతాఫ్రికాపై నెగ్గింది. దీంతో టీ20 వరల్డ్​కప్ హిస్టరీలో రెండోసారి టైటిల్​ను ముద్దాడింది. ఇక టోర్నీ ఛాంపియన్​గా నిలిచిన భారత జట్టు భారీ మొత్తంలో నజరానా అందుకుంది. విశ్వవిజేత టీమ్ఇండియాకు రూ.20.36కోట్ల ప్రైజ్​మనీ దక్కింది. ఇక రన్నరప్​గా నిలిచిన సౌతాఫ్రికా రూ.10.64కోట్లు అందుకుంది.

ప్రైజ్​మనీ వివరాలు

  • ఛాంపియన్- భారత్- రూ.20.36కోట్లు
  • రన్నరప్- సౌతాఫ్రిక- రూ.10.64కోట్లు
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- విరాట్ కోహ్లీ- రూ.4.15 లక్షలు
  • స్మార్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్- సూర్యకుమార్- రూ.2.5 లక్షలు
  • ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ- జస్ప్రీత్ బుమ్రా- రూ.12.45 లక్షలు

ఈ టోర్నమెంట్​లో మరిన్ని విశేషాలు

అత్యధిక పరుగులురహ్మానుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్థాన్)281 పరుగులు
అత్యధిక వ్యక్తిగత స్కోర్నికోలస్ పూరన్ (వెస్టిండీస్)98 పరుగులు
అత్యధిక వికెట్లుఅర్షదీప్ సింగ్ (భారత్)17 వికెట్లు
అత్యుత్తమ బౌలింగ్ఫజల్లా ఫరూకీ (అఫ్గానిస్థాన్)5/9
అత్యధిక క్యాచ్​లుఎయిడెన్ మర్​క్రమ్ (సౌతాఫ్రికా)8 క్యాచ్​లు

టోర్నీలో మిగిలిన జట్లకు అందనున్న ప్రైజ్​మనీ

  • సూపర్ 8​కు చేరిన జట్లకు- రూ.3.17 కోట్లు
  • 9 నుంచి 12వ స్థానాల్లో నిలిచిన జట్లకు- రూ. 2.05 కోట్లు
  • 13 నుంచి 20 స్థానాల్లో ఉన్న జట్లకు- రూ. 1.87 కోట్లు

మ్యాచ్​లో మరిన్ని విశేషాలు

  • టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా ఎంపికవడం విరాట్​కు ఇది 16వ సారి. టీ20ల్లో అత్యధిక సార్లు ఈ అవార్డు అందుకున్న ప్లేయర్​గా నిలిచాడు. సూర్య (15), రోహిత్ (14) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
  • టీ20 వరల్డ్​కప్ గెలవడం టీమ్ఇండియాకు ఇది రెండోసారి. ఇంగ్లాండ్ (2010, 2022), వెస్టిండీస్ (2012, 2016) కూడా రెండుసార్లు నెగ్గాయి.
  • కెప్టెన్​గా రోహిత్​కు ఇది 50వ టీ20 విజయం. పొట్టి ఫార్మాట్​లో అత్యధిక మ్యాచ్​లు నెగ్గిన కెప్టెన్ రోహిత్ శర్మే. బాబర్ ఆజమ్ (48), బ్రియన్ మసాబా (45) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
  • ఈ టోర్నీలో బుమ్రా ఎకనమీ 4.17. ఓ టీ20 ప్రపంచకప్​ ఎడిషన్లో అతి తక్కువ ఎకనమీతో బౌలింగ్ చేసిన బౌలర్ బుమ్రానే.

ఆపద్బాంధవుడు ​బుమ్రా- కప్పు గెలుపులో 'కీ' రోల్​ అతడిదే! అబ్బా ఏం బౌలింగ్​ చేశావన్న!! - Jasprit Bumrah T20 World Cup 2024

రోహిత్ విన్నింగ్ మూమెంట్​- తన స్టైల్​లో పిచ్​కు రెస్పెక్ట్ - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.