ETV Bharat / sports

ఇంపాక్ట్ రూల్​ వల్లే రింకూ సింగ్​కు జట్టులో చోటు దక్కలేదా? - T20 World Cup 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 8:55 PM IST

.
.

Impact Player Rule Rinku Singh : వరల్డ్​ కప్​ టీ20 స్క్వాడ్‌లో రింకూ సింగ్‌కు చోటు దక్కలేదు. అతన్ని రిజర్వ్డ్‌ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. దీంతో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌కు రింకూ బలైపోయాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు స్టోరీలో.

Impact Player Rule Rinku Singh : టీ20 వరల్డ్‌ కప్‌ ఆడబోతున్న భారత జట్టును మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. అయితే కేకేఆర్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌(26)కు టీమ్‌ ఇండియా స్క్వాడ్‌లో చోటు దక్కలేదు. అతన్ని రిజర్వ్ ప్లేయర్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే ఐపీఎల్‌లో అమల్లో ఉన్న ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్ కారణంగానే రింకూ అవకాశాలు దెబ్బతిన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ కారణంగా ఐపీఎల్‌ టీమ్‌లకు 12 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. దీంతో పవర్-హిట్టర్‌ రింకూ సింగ్‌కు తన ప్రతిభను చూపించడానికి కేకేఆర్‌ తరఫున సరైన అవకాశం దక్కలేదు. ఎక్కువ మంది బ్యాటర్లు ఉండటంతో డెత్‌ ఓవర్లలో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూకు చాలా తక్కువ బంతులు ఆడే అవకాశమే దక్కింది. అదే సమయంలో వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటుకు రింకూతో పోటీపడి ఎంపికైన శివమ్‌ దూబే పరిస్థితి వేరుగా ఉంది. అతనికి సీఎస్కే ఆడిన 10 మ్యాచ్‌లలో ఎక్కువ ఓవర్లు బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది.

  • శివమ్‌ దూబే వర్సెస్‌ రింకు
    ఐపీఎల్‌ 2023లో రింకూ ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. కొద్ది రోజులకే అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేశాడు. కానీ టీ20 వరల్డ్‌ కప్‌కు మాత్రం ఎంపిక కాలేకపోయాడు. మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగిన సెలక్షన్‌ మీటింగ్‌లో పాండ్యా, దూబేకి ఏకగ్రీవంగా ఓటేసిన ప్యానల్ మెంబర్‌లు రింకూని పక్కనపెట్టారు.

    దీనిపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ - ‘నిస్సందేహంగా, రింకూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు బలయ్యాడు. అతను చాలా దురదృష్టవంతుడు. ఈ సీజన్‌లో హార్దిక్ పేలవమైన ఫామ్‌లో ఉన్నా, అతను ఇప్పటికీ భారతదేశపు అత్యుత్తమ సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్. అతన్ని ఎంపిక చేయకపోతే జట్టుకు నష్టం. అందుకే పాండ్యను తీసుకున్నారు. ’ అని చెప్పాడు.
  • ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ రింకూపై ఎలాంటి ప్రభావం చూపింది?
    కోల్‌కతా నైట్ రైడర్స్ రింకూను ఫినిషర్‌గా భావించింది. అతనికి టాప్ ఫైవ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఈ వరల్డ్ కప్​ జట్టు సెలక్షన్‌కు ముందు ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో, అతను కేవలం 82 బంతులు మాత్రమే ఆడాడు. ఇందులో 9 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు. రింకూను ముందుగా బ్యాటింగ్‌కు పంపలేదని KKRను నిందించలేం. జట్టు అవసరాల దృష్ట్యా ఇతర బ్యాటర్‌లను సద్వినియోగం చేసుకుంది జట్టు. రింకూను ఇంపాక్ట్ కిందే పరిగణించింది!

    మరోవైపు రింకూ కాంపిటేటర్‌ దూబేకు సీఎస్కేలో పుష్కలంగా అవకాశాలు వచ్చాయి. 2021 సీజన్‌ నుంచి దూబేకు ధోనీ అవకాశాలు ఇస్తున్నాడు. CSK తరఫున ఈ సీజన్‌లో దూబే 9 మ్యాచ్‌లలో 203 బంతులు ఆడాడు. అతనికి 24 ఫోర్లు, 26 సిక్సర్లు బాదే అవకాశం దక్కింది.
  • 15 ఇంటర్నేషనల్ టీ20లు - 2024 జనవరి వరకు టీమ్ ఇండియా తరఫున రింకూ 15 టీ20లు ఆడాడు. 89 యావరేజ్‌, 176 స్ట్రైక్‌ రేటుతో 356 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శన కూడా రింకూకు టీ20 జట్టులో చోటు అందించలేదు.
  • అవకాశాలు ఉన్నాయా?
    రింకూ ట్రావెలింగ్ రిజర్వ్‌లలో భాగంగా ఉన్నాడు. జట్టు సభ్యుల్లో ఎవరైనా గాయపడితే అతనికి 15 మంది స్క్వాడ్‌లో చోటు ఉంటుంది. అలాగే మే 23 వరకు, సెలెక్టర్లకు జట్టులో మార్పులు చేసే అవకాశం కూడా ఉంది.


కోల్​కతా బౌలర్ ఓవర్​ యాక్షన్​ - ఒక మ్యాచ్​ నిషేధం - IPL 2024 KKR

ప్లే ఆఫ్స్​కు ఆ స్టార్ ప్లేయర్స్​ దూరం - ఎందుకంటే? - IPL 2024 Play Offs

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.