Suryakumar Yadav T20 World Cup 2024 : గతేడాది చీలమండకు చికిత్స చేయించుకున్న సూర్య కుమార్ యాదవ్‌కు జనవరిలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ కూడా జరిగింది. గాయం తర్వాత నేషనల్ టీమ్ఇండియాలో స్థానం దక్కించుకునేందుకు న్యూట్రిషనిస్ట్ శ్వేతా భాటియా సలహాలు పాటించాడు. అన్నం, పాల ఉత్పత్తులను మొత్తానికే పక్కకు పెట్టేసి గోధుమలతో పాటు ఇతర పిండితో చేసిన రొట్టెలు, ప్రొటీన్ కోసం గుడ్లు, మాంసం, చేపలు తిన్నాడట. కూరగాయలు, నట్స్, ఆవకాడో ఆహారంలో డైలీ తీసుకునేవాడట. రీసెంట్‌గా అతని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రస్తుతం సన్నగానే కాకుండా, స్ట్రాంగ్‌గా, బలంగా మారినట్లు కనిపిస్తున్నట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
"ఒకసారి అతడ్ని చూస్తే తెలుస్తుంది. ఫుడ్ సప్లిమెంట్స్‌ను కరెక్ట్‌గా తీసుకుంటూ చాలా సన్నగా, బలంగా మారగలిగాడు. రికవరీ రేట్‌తో పాటు మజిల్ గెయిన్ రేట్‌ను కోఆర్డినేట్ చేస్తూ ఇది సాధించగలిగాం. సర్జరీ తర్వాత 14-15 కేజీల వరకూ బరువు పెరిగాడు. అదంతా సహజంగా మెడిసిన్ వల్ల వచ్చే రియాక్షన్ మాత్రమే. ఈ 15 కేజీల బరువులో 13 కేజీలు ఫ్యాట్ అని డెక్సా మెషీన్ కన్ఫమ్ చేసింది. సర్జరీ తర్వాత తన డైట్ ప్లాన్‌ను కఠినంగా ఫాలో అయ్యాం. ఏ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఆహారం విషయంలో మోతాదును పెంచలేకపోయాం. త్వరగా రికవరీ కావడానికి మాత్రం విటమిన్లు ఇచ్చే వాళ్లం. అతను ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఇంకా శక్తిని కూడదీసుకుని బెటర్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. టోర్నమెంట్ మొదలైపోతుండటం వల్ల చాలా తక్కువ టైమ్‌లోనే సాధించాలని టార్గెట్ పెట్టుకున్నాం. నేషనల్ క్రికెట్ అకాడమీతో కోఆర్డినేట్ అవుతూనే ఉన్నాం. మ్యాచ్‌లు జరగకపోయినా ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి ఇప్పటి డైట్ ప్లాన్‌లో మార్పులు చేశాం." అంటూ సూర్యకుమార్ డైటీషన్ పేర్కొన్నారు.
ఇక శనివారం జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ 31 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాపై టీమ్ఇండియా 60 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
యూఎస్ టూర్లో జైస్వాల్ - రోహిత్ స్టైల్లో వార్నింగ్ ఇచ్చిన స్టార్ క్రికెటర్! - T20 World Cup 2024
'డివిలియర్స్ కంటే డేంజర్‌గా'- కమ్‌బ్యాక్‌లో సూర్య మెరుపులు - Suryakumar Yadav Comeback