ETV Bharat / sports

ముంబయి వీడనున్న సూర్యకుమార్? - ఈ స్టార్ క్రికెటర్ పైనే ఆ ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్! - Suryakumar Yadav KKR - SURYAKUMAR YADAV KKR

Suryakumar Yadav IPL : ఐపీఎల్ టీమ్​ ముంబయి ఇండియన్స్​లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్​ను తాజాగా మరో ఫ్రాంచైజీ ట్రేడ్ చేసుకునేందుకు రెడీగా ఉందంట. ఇంతకీ అదే టీమ్ అంటే?

Suryakumar Yadav KKR
Suryakumar Yadav (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 25, 2024, 9:24 AM IST

Updated : Aug 25, 2024, 9:36 AM IST

Suryakumar Yadav IPL : మరికొద్ది నెలల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ మొదలవ్వనుంది. దీంతో ఆయా ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ఫ్లేయర్లను రిటైన్ చేసుకునేందుకు అలాగే ట్రేడ్ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో ఈ మెగా ఆక్షన్​కు ఎప్పుడు లేనంత క్రేజ్ వచ్చింది. బీసీసీఐతో మీటింగ్​లో పలు విషయాలను ప్రస్థావించిన ఫ్రాంచైజీ ఓనర్లు మెగా ఆక్షన్ కంటే ముందే పలువురు స్టార్ ప్లేయర్లను జట్టులోకి తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా కోల్​కతా నైట్​ రైడర్స్ టీమ్​ తమ జట్టుకు స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్​ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అది కూడా జట్టు కెప్టెన్​గా. ఇప్పటికే ఈ విషయాన్ని సూర్యకుమార్​తో చర్చించారని, అతడు ఈ ఆఫర్​కు ఓకే చెప్తే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమై సోషల్ మీడియాలో రూమర్స్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై కోల్​కతా నైట్​రైడర్స్ ఫ్రాంచైజీ స్పందించలేదు.

ఇక సూర్యకుమార్ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే, కోల్‌క‌తా జ‌ట్టుతోనే సూర్యకుమార్​ తన కెరీర్​ను ప్రారంభించాడు. 2014 నుంచి 2017 వ‌ర‌కూ అతడు ఆ టీమ్​కు ప్రాతినిథ్యం వహించి 54 మ్యాచుల్లో 608 పరుగులు స్కోర్ చేశాడు. ఆ త‌ర్వాతనే ముంబయి ఇండియన్స్ జట్టులో చేరాడు. అప్పటి నుంచి ముుంబయి టీమ్​కు కీలక ఇన్నింగ్స్ అందించాడు. అయితే తాజాగా ముంబయి జట్టులో జరుగుతున్న కాంట్రవర్సీల వల్ల సూర్యకుమార్ అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. దీంతో సూర్యకుమార్ ఈ ఆఫర్​కు ఓకే చెప్పే ఛాన్స్​లు ఉన్నాయని క్రికెట్ వర్గాల మాట.

గతంలో సూర్యకుమార్​ను వదులుకుని తామ తప్పు చేశామంటూ కోల్​కతా నైట్​రైడర్స్ టీమ్ కూడా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రూమర్ వల్ల మళ్లీ ఆ మాటలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. స్కై ఫ్యాన్స్ కూడా తమ ఫేవరట్ స్టార్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడో అని సోషల్ మీడియాలో కామెంట్​ చేస్తున్నారు.

'ఇప్పటికీ మా బంధం అలానే ఉంది - అందుకే అటువంటి అవకాశం వచ్చింది' - India Tour Of Srilanka

'అందుకే హార్దిక్​కు కెప్టెన్సీ ఇవ్వలేదు - సూర్యకుమార్ బెస్ట్​' - Hardik Suryakumar yadav

Last Updated : Aug 25, 2024, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.