ETV Bharat / sports

సన్​రైజర్స్ 'తగ్గేదేలే'- బాలయ్య, పవన్ కల్యాణ్ మేనరిజంతో కెమెరాకు ఫోజులు - Sunrisers Hyderabad Ipl 2024 - SUNRISERS HYDERABAD IPL 2024

Sunrisers Hyderabad Ipl 2024: సన్​రైజర్స్​ హైదరాబాద్ జట్టుకు 2024 ఐపీఎల్​లో సెంచురీ మ్యాట్రెస్ స్పాన్సర్​గా వ్యవహించనుంది. ఈ సందర్భంగా సెంచురీ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్​లో పాల్గొన్న సన్​రైజర్స్ ప్లేయర్లు టాలీవుడ్ హీరోల మేనరిజంతో ఆడియెన్స్​ను ఆకట్టుకున్నారు.

Sunrisers Hyderabad Ipl 2024
Sunrisers Hyderabad Ipl 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 8:58 PM IST

Sunrisers Hyderabad Ipl 2024: సన్​రైజర్స్​ హైదరాబాద్ జట్టుకు 2024 సీజన్​కు గాను ప్రముఖ మ్యాట్రెస్ కంపెనీ 'సెంచురీ' (Centuary India) స్పాన్సర్​షిప్ ప్రకటించింది. 'సన్‌రైజర్స్ హైదరాబాద్​కు సక్సెస్​ఫుల్ హిస్టరీ ఉంది. అది ఒక బలమైన జట్టు. అదేవిధంగా మా సెంచురీ మ్యాట్రెస్​కు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంచి మార్కెట్​ ఉంది' అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలో సెంచురీ మ్యాట్రెస్ హైదరాబాద్​లో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్​ నిర్వహించింది. ఈ ఈవెంట్​కు సన్​రైజర్స్​ ప్లేయర్లంతా హాజరై సందడి చేశారు. అయితే స్టేజ్​పై కూర్చున్న సన్​రైజర్స్ ప్లేయర్లు, టాలీవుడ్ స్టార్ హీరోల మేనరిజంతో కెమెరాకు ఫోజులివ్వడం ఈవెంట్​లో హైలైట్​గా నిలిచింది. అల్లు అర్జున్ పుష్ప 'తగ్గేదేలే', నందమూరి బాలకృష్ణ మేనరిజం 'తొడ కొట్టడం', పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్ ​' మేనరిజంతో అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఈవెంట్​కు సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

SRH vs CSK IPL 2024: సన్​రైజర్స్ హోం గ్రౌండ్​లో శుక్రవారం చెన్నై సూపర్​ కింగ్స్​ను ఢీకొట్టనుంది. దీంతో చెన్నై ప్లేయర్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియంలో ప్రెస్​మీట్ నిర్వహించింది. ప్రెస్​మీట్​లో పాల్గొన్న ఇరుజట్ల కోచ్​లు తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

హై స్కోర్ రిపీట్!
'ఉప్పల్‌ పిచ్‌ బౌలర్లకు కష్టంగా ఉంటుంది. ప్రతిసారీ అభిమానుల అంచనాలు అందుకోవడం కాస్త కష్టమే. అయినా ఉప్పల్ స్టేడియం వేదికగా మరోసారి భారీ స్కోర్ సాధించేందుకు మేం సిద్ధమవుతున్నాం' అని సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ హెడ్‌ కోచ్‌ డేనియల్‌ వెట్టోరి అన్నాడు. ఇక ఇదే ప్రెస్​మీట్​లో చెన్నై బ్యాటింగ్ కోచ్ మైకేల్‌ హాస్సీ మాట్లాడాడు. 'సన్​రైజర్స్​తో మ్యాచ్​లో మేం బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణిస్తాం. నాకు ఆ నమ్మకం ఉంది. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్​కు అనుకూలంగా ఉంటుంది. మా కొత్త కెప్టెన్​ కూడా బాగా ఆడుతున్నాడు. తప్పకుండా రేపటి మ్యాచ్​లో విజయం సాధిస్తాం' అని హస్సీ అన్నాడు.

ఇది సన్​రైజర్స్​ జట్టేనా?- ఆ సెంటిమెంట్ వర్కౌటైతే కప్పు పక్కా హైదరాబాద్​దే! - Sunrisers Hyderabad IPL

సన్​రైజర్స్ సంచలనం- ఐపీఎల్​లో ఆల్​టైమ్ హైయెస్ట్ స్కోర్​ నమోదు - SRH VS MI IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.