ETV Bharat / sports

రిలాక్స్​ మోడ్​లో కమిన్స్​- గ్యాప్​లో దుబాయ్ ట్రిప్- SRH ఫ్యాన్స్ టెన్షన్! - IPL 2024

Pat Cummins IPL 2024: 2024 ఐపీఎల్​ దాదాపు ముంగింపు దశకు చేరుకుంది. ఈ దశలో అన్ని జట్లు ఫ్లే ఆఫ్స్​ చేరేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సన్​రైజర్​ కెప్టెన్ కమిన్స్​ దుబాయ్​ ట్రిప్​నకు వెళ్లాడు. దీంతో సన్​రైజర్స్ ఫ్యాన్స్​ ఆందోళన చెందుతున్నారు.

Pat Cummins IPL 2024
Pat Cummins IPL 2024 (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 7:24 PM IST

Updated : May 10, 2024, 8:10 PM IST

Pat Cummins IPL 2024: 2024 ఐపీఎల్​లో ప్యాట్ కమిన్స్​ సారథ్యంలోని సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు అదరగొడుతోంది. ఈ సీజన్​లో సన్​రైజర్స్​ ఎలాంటి బెదురు లేకుండా ఆడడానికి కారణం జట్టు కెప్టెన్ కమిన్సే అనడంలో సందేహం లేదు. ఇప్పటివరకు 12 మ్యాచ్​లు ఆడిన సన్​రైజర్స్ 7 విజయాలతో ప్లేఆఫ్స్​కు చేరువలో ఉంది. ప్రస్తుతం 14 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్న సన్​రైజర్స్​ ఇంకో విజయం సాధిస్తే దాదాపు బెర్త్ ఖరారవుతోంది. దీంతో సన్​రైజర్స్ కచ్చితంగా టాప్- 4లో ఉంటుందన్న నమ్మకంతో అభిమానులంతా ప్లేఆఫ్స్​కు రెడీ అవుతున్నారు. కానీ, అంతలోనే ఫ్యాన్స్​ను కంగారులో పడేశాడు కమిన్స్​.​

ప్లేఆఫ్స్​ ముంగిట మ్యాచ్​లు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే సన్​రైజర్స్​కు ఇంకో వారం దాకా మ్యాచ్​లు లేకపోవడం వల్ల కెప్టెన్ కమిన్స్​ కాస్త బ్రేక్ తీసుకున్నాడు. లఖ్​నవూతో మ్యాచ్​ తర్వాత కమిన్స్​ ఫ్యామిలీతో కలిసి దుబాయ్​ ట్రిప్​నకు వెళ్లాడు. అక్కడ ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. కమిన్స్ దుబాయ్​లో గోల్ఫ్ ఆడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

'ప్లేఆఫ్స్ ముందు ఇలాంటి వెకేషన్​లు అవసరమా?', 'కమిన్స్ సన్​రైజర్స్​ను పట్టించుకోవడం లేదా?', 'రూ.25 కోట్లు బాగానే వాడుతున్నాడు', 'వారం రోజుల గ్యాప్ ఎంజాయ్ చేస్తున్నాడు' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలాంటి హై కాంపిటేషన్ టోర్నీల్లో 'గ్యాప్ దొరికితే రిలాక్స్ అవ్వడం మంచిదే'నని మరికొందరు అంటున్నారు. ఇక సన్​రైజర్స్​ మే 16న సొంత మైదానం ఉప్పల్​లో గుజరాత్​ టైటాన్స్​తో తలపడనుంది.

ఇక ప్రస్తుత సీజన్​లో సన్​రైజర్స్ జట్టు ఐపీఎల్​లో అనేక రికార్డులు సృష్టించింది. ఐపీఎల్​లో అత్యధిక టాప్- 2 స్కోర్ (287, 277 పరుగులు) సన్​రైజర్స్​ పేరిటే ఉన్నాయి. మూడుసార్లు 260+ స్కోర్లు నమోదు చేసి ఔరా అనిపించింది. ఈ క్రమంలో సన్​రైజర్స్ ఇప్పటివరకు 12 మ్యాచ్​ల్లో కలిపి 146 సిక్స్​లు బాదింది. సింగిల్ సీజన్​లో ఓ టీమ్ బాదిన అత్యధిక సిక్స్​లు కూడా ఇవే.

'అభిషేక్ బ్యాటింగ్​ స్ట్రైల్ ఫుల్​ క్లాస్​- అచ్చం యువీలానే' - Abhishek Sharma IPL

58 బంతుల్లోనే 166 ఉఫ్‌ - సన్​రైజర్స్​ ఖాతాలో రికార్డులే రికార్డులు - IPL 2024 LSG VS SRH

Last Updated : May 10, 2024, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.