New Zealand vs Sri Lanka Test 2024 : న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ను శ్రీలంక 2- 0 తో కైవసం చేసుకుంది. రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 15ఏళ్ల తర్వాత శ్రీలంక తొలిసారి కివీస్‌తో టెస్టు సిరీస్ దక్కించుకుంది. ఇదివరకు 2022- 23లో కివీస్ గడ్డపై రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక 0-2తో ఓడగా, 2019లో స్వదేశంలో జరిగిన సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 602- 5 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలోఆన్‌లో పడిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ, ఇన్నింగ్స్ ఓటమి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో 360 పరుగులకు ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ (78 పరుగులు), మిచెల్ శాంట్నర్ (67 పరుగులు), టామ్ బ్లండెల్ (60 పరుగులు), డేవన్ కాన్వే (61 పరుగులు) హాఫ్ సెంచరీలు సాధించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన ప్రభాత్ జయసూర్య లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Sri Lanka clinch the series in style! 🏆🇱🇰 #SLvNZ
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 29, 2024
Dominant performance sees them win the second Test by an innings and 154 runs, taking the series 2-0.
Congratulations to the team on a fantastic series win! 🎉 pic.twitter.com/XbbAdlvo7k
WTCలో మెరుగైన లంక
ఈ సిరీస్ విజయంతో శ్రీలంక పాయింట్ల శాతాన్ని మరింత మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం 55.56 శాతం (60 పాయింట్లు)తో మూడో స్థానంలో కొనసాగుతోంది. 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో 9 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక ఐదింట్లో నెగ్గింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దీంతో శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులోకి దూసుకొచ్చింది. పాయింట్ల పట్టికలో భారత్ 71.67 పాయింట్ శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా 62.50 శాతంతో రెండో ప్లేస్‌లో ఉంది. అటు తాజా సిరీస్ ఓటమితో న్యూజిలాండ్ ఏకంగా ఏడో పొజిషన్‌కు పడిపోయింది. 8 టెస్టుల్లో 3 విజయాలు, 5 ఓటములు 37.50 పాయింట్ శాతంతో ఏడో స్థానంలో ఉంది.
భారత్ x బంగ్లాదేశ్ - రెండో రోజు వాష్ ఔట్ - India Vs Bangladesh 2nd Test