ETV Bharat / sports

అలా చేసింది నేనే - అందరూ మర్చిపోయినట్లు ఉన్నారుగా : సౌరభ్‌ గంగూలీ - Sourav Ganguly T20 World Cup 2024 - SOURAV GANGULY T20 WORLD CUP 2024

Sourav Ganguly T20 World Cup 2024 : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ తాజాగా తనపై కామెంట్ చేసే విమర్శకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. వారందరూ ఓ విషయం గురించి మర్చిపోయారంటూ వ్యాఖ్యానించాడు. ఇంతకీ అదేంటంటే?

Sourav Ganguly T20 World Cup 2024
Sourav Ganguly (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 5:09 PM IST

Sourav Ganguly T20 World Cup 2024 : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. తనపై కామెంట్ చేసే విమర్శకులపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. వారందరూ ఓ విషయం గురించి మర్చిపోయారంటూ వ్యాఖ్యానించాడు.

టీ20 ప్రపంచప్‌ గెలుపుతో దేశమంతా సంబరాలు చేసుకున్నారని, ఆ ఖ్యాతిని కొనియాడుతున్నారని అన్నాడు. అయితే ఈ విజయానికి వెనక ఉన్న రోహిత్‌ శర్మను టీమ్‌ఇండియా కెప్టెన్‌గా చేసిన తనను మాత్రం అందరూ మర్చిపోయారంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

"రోహిత్ శర్మకు నేను టీమ్ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు అందించినప్పుడు అందరూ నన్ను విమర్శించారు. ఇప్పుడు అతడి సారథ్యంలోనే భారత్ టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. దీంతో అందరూ నన్ను విమర్శించడం మానేశారు. అందరూ ఆ విషయాన్ని మరచిపోయారని నేను అనుకుంటున్నా. రోహిత్‌ను భారత జట్టుకు కెప్టెన్‌గా నియమించింది నేనే" అంటూ గంగూలీ అన్నాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే?
టీమ్ఇండియా కెప్టెన్​గా రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించిన సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఉన్నాడు. అయితే గంగూలీ తీసుకున్న నిర్ణయం గురించి చాలా మంది నుంచి ఆయన్ను విమర్శించడం మొదలెట్టారు. అది సరైనదని కాదంటూ కామెంట్ చేశారు.

2021లో జరిగిన టీ20 ప్రపంచ కప్​లో భారత జట్టు అనుహ్యంగా గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన తర్వాత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకున్నాడు. ఆ తర్వాత ఆ బాధ్యతలను రోహిత్ శర్మ అందుకున్నాడు. దీంతో రోహిత్ కెప్టెన్సీపై కూడా పలువురు కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు అతడి సారథ్యంలో టీమ్ఇండియా అనేక సిరీస్‌లు గెలుపొందింది.

2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌, 2023 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ వరకు చేరుకుంది. ఆ టోర్నీల్లో చివరి మెట్టుపై బోల్తాపడిన టీమ్ఇండియా 2024 టీ20 ప్రపంచ కప్‌ను మాత్రం ముద్దాడింది. దీంతో క్రికెట్​ లవర్స్​తో పాటు భారత ప్రజలు సంబరాలు చేసుకున్నారు. బీసీసీఐ కూడా విజయోత్సవాల్లో భాగంగా రోడ్​షో నిర్వహించి టీమ్ఇండియా ప్లేయర్లను సన్మానించింది.

లార్డ్స్ విజయానికి 22ఏళ్లు- గంగూలీ మాస్ లెవెల్ సెలబ్రేషన్స్ గుర్తున్నాయా? - Ind vs Eng Lords 2022

'గంభీర్ సరైనోడే, వాళ్లను డీల్ చేయడం అతడికి తెలుసు' - India Head Coach

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.