Shooter Manu Bhaker In Chennai : పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటింగ్ స్టార్ మను భాకర్‌ను చెన్నైలో ఘనంగా సన్మానించారు. నోలంబూర్‌లోని ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో ఆమెకు సన్మాన కార్యక్రమం జరిగింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తరఫున మను బాకర్‌కు రూ.2.07 కోట్ల ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఆ తర్వాత విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మను భాకర్ సమాధానాలు చెప్పింది. వారితో కలిసి పాటలు పాడుతూ సరదాగా గడిపింది.
Shooter Manu Bhaker ❌
— Mayank (@_mayyyank) August 20, 2024
Dancer Manu Bhaker ✅
The Velammal Nexus group is felicitating double Olympic medallist Manu Bhaker for her inspiring #Paris2024 campaign@sportstarweb pic.twitter.com/wVWUlwbPGx
"పెద్ద కలలు కనాలి, వాటిని సాధించేందుకు కష్టపడాలి. ఫెయిల్ అయినా వదలకూడదు. ప్రయత్నిస్తూనే ఉండాలి. నేను నా స్కూల్ డేస్‌లోనే కాంపిటీషన్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టాను. స్కూల్ డేస్‌లో మనకు మొదట ఇంట్లో, తర్వాత స్కూల్లో సపోర్ట్ కావాలి. నాకు ఆ రెండూ లభించాయి. జీవితంలో డాక్టర్, ఇంజనీర్ మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రీడా రంగంలో ఎక్కువ అకాశాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ప్రయాణించాలనే కోరిక ఉన్న వాళ్లు స్పోర్ట్స్ కెరీర్‌ని ఎంచుకోవాలి, నేను ఇప్పటికే సగం ప్రపంచం ట్రావెల్ చేశాను. మన నేపథ్యం గురించి చెప్పడంలో ఎప్పుడూ సిగ్గుపడకండి. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ముఖ్యం కాదు. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు చాలా విషయాలు తెలియవు, తర్వాత నేర్చుకున్నాను. వారు నేర్పించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు నేను చాలా నెర్వస్‌గా ఫీల్ అయ్యాను. నాకు ఆత్మవిశ్వాసం లేదు. వీటిని ఏదో ఒక దశలో వదిలేయాలి. అదే చేశాను. ఎన్నో ఫెయిల్యూర్స్ కారణంగానే ఇప్పుడు విజయం సాధించగలిగాను" అని మను భాకర్ పేర్కొంది.
'సీఎం తెలియదు - ఆ హీరో బాగా తెలుసు'
అయితే ఈ సెషన్‌లో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. అక్కడి వారు 'మీకు మా సీఎం స్టాలిన్ తెలుసా' అని అడిగిన ప్రశ్నకు మను అమాయకంగా తెలియదూ అంటూ తల ఊపింది. ఆ తర్వాత 'హీరో విజయ్ తెలుసా' అంటే దానికి ఆమె ఆయన నాకు చాలా బాగా తెలుసు అంటూ సమాధానమిచ్చింది. దీంతో అక్కడి వారంతా నవ్వారు.
Olympic shooter #ManuBhaker reveals her fan moment for Thalapathy @actorvijay 🤩 pic.twitter.com/YCmGwfDAFj
— Vijay Fans Trends 🐐 (@VijayFansTrends) August 20, 2024
ఆ తర్వాత మను బాకర్ మీడియాతో మాట్లాడింది. మీ విజయానికి కారణం ఎవరనే? ప్రశ్నకు "నా విజయానికి చాలా మంది కారణం. నా కుటుంబం, కోచ్, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇతరుల సమిష్టి కృషి ఉంది." అంటూ సమాధానమిచ్చింది.
ఒలింపిక్స్‌లో భారత్ ఇతర దేశాల కంటే వెనుకబడి ఏమనుకుంటున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు, "అవును చాలా దేశాలు మనకంటే ముందు ఉన్నాయి. మేమంతా పతకాల సంఖ్యను పెంచాలని ఆశిస్తున్నాం. ముఖ్యంగా చిన్నతనం నుంచి పిల్లలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది." అని మను చెప్పింది.
సమాజాన్ని బాగు చేయాల్సిన బాధ్యత మనదే
మహిళల భద్రత గురించి కూడా మనూ ఈ ఈవెంట్‌లో మాట్లాడింది. "మహిళలు మన దేశ జనాభాలో 50 శాతం ఉన్నారు. ప్రాథమిక హక్కులు స్వేచ్ఛ ఆధారంగా మాత్రమే లభిస్తాయి. మహిళల కోసం సమాజాన్ని బాగు చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. ఇది ప్రతి వ్యక్తి విధి. సమాజంలో అందరం కలిసి పని చేయాలి. మనం మార్పు తీసుకురావాలి. మనం ప్రగతి బాటలో ఉన్నాం." అంది.
ఆమె ఎప్పుడూ ఫైటరే
వినేశ్ ఫోగట్ అంశంపై స్పందిస్తూ, "ఆమె నాకు అక్క లాంటిది. ఆమె అంటే నాకు చాలా గౌరవం. నేను ఆమెను ఎప్పుడూ ఫైటర్‌గా చూశాను. అన్ని సమస్యలను అధిగమించగల సామర్థ్యం ఆమెకుంది." అని మను తెలిపింది. తన భవిష్యత్తు ప్రణాళికలపై స్పందిస్తూ, ఇప్పుడు మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నానని, 4 లేదా 5 నెలల తర్వాత తిరిగి వర్క్ చేయడం ప్రారంభిస్తానని చెప్పింది.
'ఆ గాయాలు నాపై ఎఫెక్ట్ చూపించాయి - అందుకే అవన్నీ అలవాటు చేసుకున్నా' - Manu Bhaker Special Interview
మను సక్సెస్‌కు ఆ ట్రైనింగే కారణం!- దానివల్లే అంత కాన్ఫిడెన్స్? - Manu Bhaker Olympics 2024