ETV Bharat / sports

అవన్నీ ఫేక్- మీ టాలెంట్​నే నమ్మకోండి: సర్ఫరాజ్ తండ్రి - naushad khan cricketer

Sarfaraz Khan Father: తన పేరుతో స్కామర్లు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్లు చేస్తున్నారని టీమ్ఇండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ అన్నారు.

Naushad Khan
Naushad Khan
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 7:05 PM IST

Updated : Mar 5, 2024, 7:43 PM IST

Sarfaraz Khan Father: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. గతనెల భారత్​ తరఫున సర్ఫరాజ్ అంతర్జాతీయ అరంగేట్రం (International Debut) చేసిన సందర్భంగా నౌషద్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. కుమారుడి కోసం ఎంత కష్టపడింది పలు సందర్భాల్లో ఆయన చెప్పారు. ఈ క్రమంలో నౌషద్​కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లవెత్తాయి. దీంతో కొన్నిరోజులుగా నౌషద్ ఖాన్ పేరు నెట్టింట తరచూ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆయన ఫేమ్​ను కొంతమంది స్కామర్లు (Scams Frauds) క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని నౌషద్ ఖాన్ అన్నారు. సోషల్ మీడియా​లో నౌషద్ ఖాన్ పేరిట ఫేక్ అకౌంట్లు (Fake Accounts) క్రియేట్ చేసి యువకులను డబ్బులు అడుగుతున్నారని సర్ఫరాజ్ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. 'అందరికీ నమస్కారం. కొంతమంది స్కామర్లు ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​లో నా పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఐపీఎల్​లో నెట్​ బౌలర్​గా ఛాన్స్ ఇప్పిస్తామంటూ యువతను డబ్బులు అడుగుతున్నారు. ఎవరు కూడా ఈ ట్రాప్​లో పడకండి. మీ టాలెంట్​ను మాత్రమే నమ్మకోండి. ప్రస్తుతానికి నేను ఐపీఎల్​లో ఏ టీమ్​కూ కూడా కోచ్​గా లేను' అని నౌషద్ ఖాన్ అన్నారు.

ఎమోషనల్ డే: ఇంగ్లాండ్​తో రాజ్​కోట్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్​తో 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. టీమ్ఇండియా మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే, సర్ఫరాజ్​కు టెస్టు క్యాప్ అందించాడు. అయితే సర్ఫరాజ్ డెబ్యూ క్యాప్ (Debut Cap) అందుకున్న సమయంలో ఓ సంఘటన అందర్నీ ఆకర్షించింది. కుమారుడు జాతీయ జట్టులో ఆరంగేట్రం చేస్తున్న సందర్భంగా సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ ఒక్కసారిగా భావోద్వేగానికి (Emotional) గురయ్యారు. సంతోషంలో ఆనందబాష్పాలతో తన కుమారుడు అందుకున్న డెబ్యూ క్యాప్​ను నౌషద్ ఖాన్ ముద్దు పెట్టుకున్నారు. ఈ వీడియో అప్పట్లో నెట్టింట వైరలైంది.

డెబ్యూ రనౌట్​పై సర్ఫరాజ్​ రియాక్షన్​- ఇలాంటివి మామూలే అంటూ!

టెస్టుల్లో సర్ఫరాజ్ డెబ్యూ- క్యాప్​ను ముద్దాడుతూ తండ్రి ఎమోషనల్

Last Updated : Mar 5, 2024, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.