Run Out Big Bash League: ఆస్ట్రేలియా డొమెస్టిక్ టోర్నమెంట్ బిగ్‌బాష్ లీగ్‌లో ఫన్నీ సంఘటన జరిగింది. టోర్నీలో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో పెర్త్ స్కాచర్స్- ఆడిలైడ్ స్ట్రైకర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆడిలైడ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. మ్యాచ్‌లో 9.1 ఓవర్ వద్ద ఫన్నీ జట్టు స్కోర్ 91-4తో ఉంది.
వికెట్ కీపర్ హ్యారీ నిల్సన్ స్ట్రైక్‌లో ఉన్నాడు. ఆండ్రూ టై బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ఓవర్ తొలి బంతిని డిఫెన్స్ ఆడిన హ్యారీ, నాన్ స్ట్రైక్‌లో ఉన్న జేక్ వెథర్ల్యాడ్ను సింగిల్‌కు పిలిచాడు. అయితే ఆ బంతి నేరుగా ఫీల్డర్ చేతికి వెళ్లింది. దీంతో ఫీల్డర్ నాన్ స్టైక్‌లో ఉన్న వెథర్ల్యాడ్ను ఔట్ చేసేందుకు త్రో విసిరాడు. అది మిస్ అయ్యి, వికెట్ల వెనక ఉన్న మరో ఫీల్డర్ వద్దకు వెళ్లింది.
ఆ ఫీల్డర్ అట్నుంటి మళ్లీ వెథర్ల్యాడ్ను రనౌట్ చేసేందుకు ప్రయత్నించగా రెండోసారి కూడా ఫెయిలైంది. అప్పటికే నాన్ స్ట్రైకింగ్ వద్దకు వచ్చిన హ్యారీ పరుగు పూర్తి చేయకుండా రిటర్న్ వెళ్లాడు. ఇక ఆ ఫీల్డర్ బంతిని వెంటనే వికెట్ కీపర్‌కు వేశాడు. దీంతో రనౌట్ కంప్లీట్ అయ్యింది. స్ట్రైకింగ్‌లో ఉన్న హ్యారీ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఇలా నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ కోసం ప్రయత్నిస్తే, స్ట్రైకింగ్‌లో ఉన్న ప్లేయర్ ఔటయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇది చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ప్లేయర్‌ను ఔట్ చేసేందుకు ప్రయత్నించి ఫీల్డర్లు చివరకు స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌నే పెవిలియన్‌కు పంపించారంటూ కామెంట్లు చేస్తున్నారు.
-
This run out 🫣
— KFC Big Bash League (@BBL) January 20, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Reliving a mix up that resulted in success for the Scorchers on not the first, not the second, but the third and final attempt! #BBL13 pic.twitter.com/zESmWnt6LS
">This run out 🫣
— KFC Big Bash League (@BBL) January 20, 2024
Reliving a mix up that resulted in success for the Scorchers on not the first, not the second, but the third and final attempt! #BBL13 pic.twitter.com/zESmWnt6LSThis run out 🫣
— KFC Big Bash League (@BBL) January 20, 2024
Reliving a mix up that resulted in success for the Scorchers on not the first, not the second, but the third and final attempt! #BBL13 pic.twitter.com/zESmWnt6LS
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌లో పెర్త్ స్కార్చర్స్ 105 పరుగులకే ఆలౌటైంది. దీంతో 50 పరుగుల తేడాతో ఆడిలైడ్ స్ట్రైకర్స్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.