ETV Bharat / sports

రితికా విషయంలో యువీ స్ట్రాంగ్​ వార్నింగ్ - రోహిత్​ను అలా అన్నాడట! - రోహిత్ శర్మ లవ్ స్టోరీ

Rohit Sharma Ritika Love Story : ముంబయిలో పుట్టి పెరిగిన తెలుగు కుర్రాడు రోహిత్ శర్మకు రితికా సింగ్ ఎలా పరిచయం అయ్యింది. అసలు రోహిత్​కు యువరాజ్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలుసుకోవాలంటే ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ లవ్ స్టోరీపై ఓ లుక్కేద్దామా?

Rohit Sharma Ritika Love Story
Rohit Sharma Ritika Love Story
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 3:38 PM IST

Updated : Feb 14, 2024, 3:49 PM IST

Rohit Sharma Ritika Love Story : లవ్ స్టోరీలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్​గానే ఉంటాయి. అది సామాన్యులైనా,సెలబ్రెటీలైనదైనా సరే. అయితే కొంతమంది దంపతులను చూస్తే అబ్బా చూడముచ్చటగా ఎంత చక్కగా ఉంది అని అనిపిస్తుంటుంది. అలాంటి జంటల్లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, రితికా సింగ్ కపుల్ ఒకటి. ఎప్పుడూ బెస్ట్​ఫ్రెండ్స్​లా కలియతిరిగే ఈ జంటది లవ్ మ్యారేజ్. అయితే వీరి లవస్టోరీ కూడా కాస్త సినిమాటిక్​గానే అనిపిస్తుంది. ఒకానొక సమయంలో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ రోహిత్ శర్మకు రితికా విషయంలో వార్నింగ్ ఇచ్చాడట. ఇంతకీ ఏం జరిగిందంటే ?

2008లో యువరాజ్​, రోహిత్ ఓ యాడ్ షూట్​లో పాల్గొన్నారు. ఆ షూట్​కు రితికా మేనేజర్. అప్పటికే రితికాతో యువరాజ్​కు ఓ ప్రత్యేక అనుబంధం ఉండేది. రితికాను అతడు తన సొంత చెల్లిలా భావించేవాడు. అందుకే షూటింగ్​కు రాగనే రోహిత్​కు ముందుగానే ఓ వార్నింగ్ ఇచ్చాడు. రితికాను చూపిస్తూ 'తను ఓ స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్. ఆమెకు నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది' అంటూ హెచ్చరించాడు. దీంతో షాక్ అయిన రోహిత్ 'ఆమెతో నాకేం పని? నేను ఇక్కడికి వచ్చింది కేవలం షూటింగ్​లో పాల్గొనేందుకు మాత్రమే' అంటూ తాను కూడా గట్టిగానే సమాధానం ఇచ్చాడట.

కొన్ని రోజుల తర్వాత మరో షూట్​లో రోహిత్-రితికా కలిశారు. అయితే మొదటిసారి రితికాను చూసినప్పుడు పెద్దగా పట్టించుకోని రోహిత్, ఆ తర్వాత కలిసినప్పుడు మాత్రం ఆమె వ్యవహారించిన తీరుకు పడిపోయాడట. షూటింగ్ సమయంలో మైక్రోఫోన్​తో ఇబ్బంది పడినప్పుడు ఆమె హుందాగా స్పందించిన తీరును రోహిత్ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడట. అలా వారిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆ తర్వాత అది స్నేహంగా పెరిగి కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రొఫెషనల్​గా దగ్గరయ్యారు. కొంత కాలం అలా స్నేహితులుగా ఎంతో హ్యాపీగా ఉన్నారు.

అయితే ఒకరోజు బోరివలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్​కు రితికను తీసుకెళ్లిన రోహిత్ అక్కడ ఆమెకు ప్రపోజ్ చేశాడు.ఇక ఆమె కూడా రోహిత్​కు ఎస్​ చెప్పింది. అలా ఆరెళ్ల పరిచయాన్ని వారు పెళ్లి బంధంగా మార్చుకున్నారు. 11 ఏళ్ల వయస్సులో తాను క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన అదే బోరివలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్​లో వీరి నిశ్చితార్థం గ్రాండ్​గా జరిగింది. ఆ తర్వాత 2015 డిసెంబర్ 13 న, ముంబయిలోని తాజ్ ల్యాండ్స్ హోటల్​లో రోహిత్ రితికలు అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. వీరిద్దరికి సమైరా అనే ఓ పాప పుట్టింది. ఈ అందమైన జంట హ్యాపీగా తమ లైఫ్​ను ఎంజాయ్ చేస్తోంది.

సమ్మీకి డైనోసర్స్​ను పరిచయం చేశాం: రోహిత్

పెళ్లి తర్వాత రోహిత్​లో ఇంత మార్పా?

Last Updated : Feb 14, 2024, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.