Rohit Sharma Jaiswal: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ సెంచరీని కెప్టెన్ రోహిత్ శర్మ సెలబ్రేట్ చేసుకోవడం ప్రస్తుతం ఇంటర్నెట్లో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ సూపర్ సెంచరీ బాదాడు. 9 ఫోర్లు, 5 సిక్స్‌లు సహా 104 పరుగులు చేశాడు. అయితే శతకం పూర్తి అవ్వగానే జైశ్వాల్ తనదైన స్ట్రైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
గాల్లోకి ఎగిరి ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తూ తన సిగ్నేచర్ మేనరిజంతో గ్రౌండ్లో సంబరాలు జరుపుకున్నాడు. ఇక కెమెరామెన్ వెంటనే టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్ వైపు కెమెరా మళ్లించాడు. జైశ్వాల్ సెంచరీ పూర్తవ్వగానే, డ్రెసింగ్ రూమ్‌లో ఉన్న టీమ్ఇండియా సిబ్బంది మొత్తం చప్పట్లు కొట్టారు. అయితే అక్కడే ఉన్న రోహిత్ మాత్రం అందరికంటే ఎక్కువ సంతోషంగా జైశ్వాల్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. జైశ్వాల్ లాగే ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తూ అతడి స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. సొంత సెంచరీని కూడా రోహిత్ అంతలా సెలబ్రేట్ చేలుకోలేదని అతడి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, జైశ్వాల్ ప్రస్తుతం కెరీర్లో దూసుకెళ్తున్నాడు. ఈ సిరీస్‌లో అతడికి ఇది రెండో శతకం. 2023లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన జైశ్వాల్ తన కెరీర్లో ఇప్పటివరకు 13 ఇన్నింగ్స్‌లో 751 పరుగులు బాదాడు. అందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి గేమ్‌పై పలువురు మాజీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 196-2తో నిలిచింది. దీంతో ప్రస్తుతం భారత్ 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (65), కుల్దీప్ యాదవ్ (3) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జో రూట్, టామ్ హర్ట్లీ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక నాలుగో రోజు ఆట ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ 319 పరుగులకు కుప్పకూలింది.
పరుగుల కంటే ఓవర్లే ఎక్కువ- రూట్‌పై శాస్త్రి ఫన్నీ కామెంట్స్
'యశస్వి యంగ్ సచిన్‌ను గుర్తుచేస్తున్నాడు- అతడు ఫ్యూచర్ సూపర్‌స్టార్'